క్షుద్రపూజలతో తండ్రిని మళ్లీ బతికిస్తా

The Father will resurrect the sick with the sicknesses

The Father will resurrect the sick with the sicknesses

-శవాన్ని ఆరు నెలలు ఉంచిన కొడుకు
Date:26/11/2018
రాయ్ పూర్ ముచ్చట్లు:
చనిపోయిన తండ్రికి అంత్యక్రియలు చేయకుండా మృతదేహాన్ని ఇంట్లో దాచిపెట్టాడు. రోజులు, వారాలపాటు కాదు ఏకంగా ఆరు నెలలపాటు తండ్రి శవాన్ని కుళ్లిపోకుండా కొన్ని రసాయనాలు, ఐస్‌ ముక్కలు నిత్యం వాడాడు. ఈ భయానక ఘటన జార్ఖండ్‌లోని మకత్‌పూర్‌ ఇందిరాకాలనీలో చాలా కాలం తర్వాత వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మకత్‌పూర్‌ ఇందిరాకాలనీలో విశ్వనాథ్‌ ప్రసాద్‌ తీవ్ర అనారోగ్యం కారణంగా ఈ ఏడాది మేలో చనిపోయాడు. తండ్రిని ఎలాగైనా బతికించాలనుకుని ప్రశాంత్‌ కుమార్‌ సిన్హా భావించాడు. అతడు ఏవో కొన్ని రసాయనాలు, ఐస్‌ ముక్కలు రోజు మార్చుతూ తండ్రి మృతదేహాన్ని కుళ్లిపోకుండా చూశాడు. తండ్రిని బతికించుకునేందుకు ఆరు నెలలుగా శవం పక్కన కూర్చుని పూజలు చేస్తూనే ఉన్నా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికైనా తండ్రికి అంత్యక్రియలు నిర్వహిద్దామని చెప్పినందుకు తల్లిపై దాడి చేశాడు. మృతదేహం ఇంట్లో ఉంచినట్లు లీసులకు చెప్తానని ప్రశాంత్‌ తల్లి అనుకుమారీ సిన్హా బెదిరించారు. దీంతో అతడు ఆమెపై చెయ్యి చేసుకున్నాడు. సోదరికై సైతం దాడికి పాల్పడగా వీరు కేకలు వేశారు. చుట్టుపక్కవారు ఇది గమనించి పోలీసులకు ఫోన్‌ చేశారు. వారు అక్కడికి వచ్చి ఆరా తీయగా అసలు విషయం బటయపడింది. తండ్రి విశ్వనాథ్‌ను మళ్లీ బతికిస్తానని క్షుద్రపూజలు చేసేవాడని, అంత్యక్రియలు చేయనివ్వలేదని తల్లి చెప్పడంతో ప్రశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Tags:The Father will resurrect the sick with the sicknesses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *