కన్నుల పండువగా సాలకట్ల మహోత్సవాలు

The festival of eyes is a festival of celebrations

The festival of eyes is a festival of celebrations

Date:15/09/2018
తిరుమల ముచ్చట్లు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మొత్సవాల్లో మూడవరోజు ఉదయాన శ్రీవారు సింహావాహనం పై భక్తులకు దర్శనమిస్తున్నారు.
అరణ్యాల్లోని క్రూర మృగాల్లో బలమైన సింహం.. మనిషి సంసార సాగరాన్ని దాటడానికి తన నామస్మరణే నావలాగా ఉపయోగపడితే… మనస్సునే…అలోచనలనే కీకారణ్యంలో మనిషిని అధః పాతాళానికి తోక్కేసే ఎంతటి దుర్మాగానికైనా ఓడిగట్టేలా చేసే క్రూరమైన సింహాల్లాంటి అలోచనల నుండి తాను మాత్రమే కాపాడగలనని స్వామి ఈ వాహనసేవ ద్వారా తెలియజేస్తున్నారు.
మరోవైపు శ్రీనివాసుడి అలయంలో గర్భగుడి నాల్గువైపులా అమ్మవారి వాహనమైన సింహం ఇక్కడే కనిపిస్తుంది. తనను నమ్మినా… తన హృదయంలోని అమ్మవారిని ప్రార్ధించినా ఒక్కటేనని అమ్మ వాహనాన్ని తన వాహనంగా చేసుకోని స్వామివారు చతుర్మాడావీధుల్లో దర్శనమిస్తారు. దుష్టశిక్షణ… శిష్టజన రక్షణకు ఈ వాహనసేవను ప్రతీకగా భావిస్తారు.
Tags:The festival of eyes is a festival of celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *