The fight against anti-labor policies

కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం

Date:13/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఐకమత్యంతో పోరాటం చేయనున్నట్లు సీఐటీయు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు తెలిపారు. గురువారం ఆయన పట్టణంలో కార్మికుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఐటీయు 7వ జిల్లా మహాసభలు చిత్తూరులో ఈనెల 28, 29 తేదీలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభలకు కార్మికులు తరలిరావాలని కోరారు. కార్మికుల వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ దేశంలో సీసీఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ తీసుకొచ్చి , కార్మికుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలపై పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.

స్థలాల క్రమబద్దీకరణకు ధరఖాస్తు చేసుకోవాలి

Tags: The fight against anti-labor policies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *