లారీలో మంటలు..డ్రైవర్ క్షేమం
పామర్రు ముచ్చట్లు:
పామర్రు మండలం కనుమూరు వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న లారీలో ఉన్నట్లుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కలకలం చోటుచేసుకుంది.కర్నూల్ నుండి బ్లీచింగ్ లోడుతో కైకలూరు వెళుతున్న లారీలో ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి, మంటలను చూసి అప్రమత్తమైన డ్రైవర్ , క్లీనర్ లారీ దిగిపోయారు. లారీ నుండి వస్తున్న మంటలను చూసి రహదారిపై వెళ్తున్న వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణం పై దర్యాప్తును చేపట్టారు.
Tags: The fire in the lorry..The driver is fine