ఏపీలో తొలి కరోనా మరణం

Date::03/04/2020

అమరావతి ముచ్చట్లు:

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్  ఏపీలో తోలి మరణాన్నినమోదు చేసింది. రాష్ట్రంలోని విజయవాడలో తొలి కరోనా మరణం సంభవించింది. విజయవాడలో 55 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. మార్చి 17న ఢిల్లీ నుంచి వచ్చిన కుమారుడి ద్వారా ఆ వ్యక్తికి కరోనా సోకింది. వెంటనే తండ్రి, కుమారుడితో కాంటాక్ట్ అయిన 29 మందిని క్వారంటైన్ కు  అధికారులు తరలించారు. అయితే.. రాష్ట్రంలో తొలి కరోనా మరణం సంభవించడంతో జిల్లా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు ఆ వ్యక్తి నుంచి ఈ వైరస్ ఎంతమందికి సోకిందో అనే ఆందోళన జనాల్లో నెలకొంది. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తొలి మరణాన్ని ప్రభుత్వం ధృవీకరించింది. మరోవైపు,. శుక్రవారం నాటికి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 161కి చేరుకుంది. ఇవాళ నెల్లూరు-8, విశాఖ-3, కడపలో ఒక పాజిటివ్ కేసు నమోదయ్యాయి.

దేశయి కృష్ణ యూత్ సభ్యులు అద్వర్యం లో ఆహార పొట్లాలు పంపిణీ

Tags:The first corona death in AP

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *