టిటిడి ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ తొలి స‌మావేశం

Date:21/01/2021

తిరుప‌తి ముచ్చట్లు:

టిటిడికి భ‌క్తులు కానుక‌గా ఇచ్చిన స్థ‌లాల‌ను ధార్మిక కార్య‌క్ర‌మాల‌కు ఉప‌యోగించే అంశాన్ని ప‌రిశీలించాల‌ని టిటిడి ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ అధికారుల‌కు సూచించింది. టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న గురువారం క‌మిటీ తొలి స‌మావేశం జ‌రిగింది.శ్రీ‌వారికి భ‌క్తులు కానుక‌గా ఇచ్చిన ఆస్తులు, భూముల‌ను శాశ్వ‌తంగా విక్ర‌యించ‌రాద‌ని, టిటిడికి ఉప‌యోగ‌ప‌డ‌ని భూముల‌ను ఏవిధంగా ఉప‌యోగంలోకి తీసుకురావాల‌నే విష‌యాల‌ను ప‌రిశీలించ‌డానికి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి తీర్మానం చేసిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు శృంగేరి శార‌దాపీఠం సిఈవో   గౌరీశంక‌ర్‌, కంచి మ‌ఠం ప్ర‌తినిధి   సీతారామ‌మూర్తి, రిటైర్డ్ చీఫ్ జ‌స్టిస్, మంత్రాల‌యం పీఠాధిప‌తి ప్ర‌తినిధి   శ్రీ‌ధ‌ర్‌రావు, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు   వైద్య‌నాథ‌న్ కృష్ణ‌మూర్తి,   గోవింద హ‌రి, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు   కె.రామచంద్ర‌మూర్తి, సామాజికవేత్త  బ‌య్యా శ్రీ‌నివాసులుతో టిటిడి క‌మిటీ ఏర్పాటు చేసింది. 1974 నుంచి 2014 దాకా దేశ‌వ్యాప్తంగా టిటిడి విక్ర‌యించిన ఆస్తుల‌కు సంబంధించిన వివ‌రాలు, ప్ర‌స్తుతం ఉన్న ఆస్తుల స్థితికి సంబంధించిన వివ‌రాలు, కోర్టు కేసులు ఇత‌ర వివాదాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క‌మిటీ స‌భ్యులకు వివరించారు. త‌క్కువ విస్తీర్ణం గ‌ల స్థ‌లాల్లో గోశాల‌లు, గీతామందిరాలు, ఇత‌ర ప్ర‌జోప‌యోగ కార్య‌క్ర‌మాల‌కు వినియోగించే అంశాన్ని ప‌రిశీలించాల‌ని సూచించారు.

 

 

 

ఈ సంద‌ర్భంగా ఈవో డాక్ట‌ర్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ భ‌క్తులు స్వామివారికి స్థ‌లాలు, భూములు కానుక‌గా స‌మ‌ర్పించే స‌మ‌యంలో అధికారులు వారి మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా, ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగ పడేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. టిటిడి భూముల‌కు సంబంధించిన లీజు పాలసీని పునఃప‌రిశీల‌న చేయాల‌న్నారు. త్వ‌ర‌లో క‌మిటీ మ‌రోసారి స‌మావేశం కావాల‌ని నిర్ణ‌యించారు.ఈ స‌మావేశంలో జెఈవో, కమిటీ కన్వీనర్   స‌దా భార్గ‌వి, ఎస్టేట్ ఆఫీస‌ర్   మ‌ల్లిఖార్జున పాల్గొన్నారు.

పుంగనూరులో జగనన్న కాలనీలో లబ్ధిదారులకు పట్టాలపై పరిశీలన

Tags: The first meeting of the TTD Assets Protection Committee

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *