తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం విజయవంతం
నెల్లూరు ముచ్చట్లు:
శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగశాల నుండి ప్రయోగానికి సిద్ధంగా ఉన్న తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం విజయవంతమయింది. అంతరిక్ష ప్రయోగాల్లో భారతదేశ కీర్తిని మరో మెట్టు పైకి తీసుకెళ్లే విధంగా హైదరాబాద్ కు చెందిన స్కై రూట్ అనే ప్రైవేటు సంస్థ భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఈ రోజు తొలి అడుగు వేసింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఈ చారిత్రాత్మక ప్రయోగానికి వేదికైంది. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు షార్ లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి తొలి ప్రవేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. , ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వచ్చారు. స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విక్రం సబార్బిటల్(VKS)అనే రాకెట్ ను అభివృద్ధి చేసింది.
Tags: The first private rocket launch was successful

