సవ్యసాచి ఫస్ట్ లుక్ 

Date:16/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సవ్యసాచి’. ‘కార్తికేయ’, ‘ప్రేమమ్’ చిత్రాల దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ శుక్రవారం విడుదలైంది. పోస్టర్‌లో చైతూ యుద్ధానికి వెళ్లే సైనికుడిలా ఉన్నాడు. నుదుటిన గాయం, కండలు తిరిగిన శరీరం.. అన్నిటికీ మించి చైతన్య వెనుక కనక దుర్గమ్మ వారిని తలపించేలా చేతులతో ఫస్ట్‌లుక్ అదిరిపోయింది. అయితే ఆ చేతులపై ఉన్న పచ్చబొట్లు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. సినిమా కథకు చేతులపై ఉన్న పచ్చబొట్లకు ఏదో సంబంధం ఉందేమో అనిపిస్తోంది.ఒక చేతిపై పాప బొమ్మ, మరో చేతిపై ‘అక్క’ అని రాసి ఉండటం, మరో చేతిపై ‘Maha’, ఇంకో చేతిపై ‘21’ అనే సంఖ్య ఇలా ప్రతీ అంశం ఆలోచింపజేస్తోంది. వాస్తవానికి ‘సవ్యసాచి’ అంటే రెండు చేతుల‌ని స‌మ‌ర్థవంతంగా, శ‌క్తివంతంగా వాడే వాడు అని అర్థం. ఇది అర్జునుడికి మరో పేరు. దీన్ని బట్టి చూస్తుంటే ఈ చిత్రంలో నాగచైతన్య పోరాట యోధుడని అర్థమవుతోంది. కచ్చితంగా శత్రువులతో మహాబలుడిలా పోరాడతాడని స్పష్టమవుతోంది. అయితే ఆ పోరాటం ఎందుకోసం, ఎవరికోసం అనేదే సస్పెన్స్.ఇదిలా ఉంటే, ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సీవీఎం) నిర్మిస్తున్నారు. చైతూ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాధ‌వ‌న్, భూమిక‌లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం మరో ప్రధాన ఆకర్షణ. జూన్ 14న విడుద‌ల సిద్ధమవుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ ఫస్ట్‌లుక్‌తో అంచనాలు మరింత పెరిగిపోయాయి. అక్కినేని అభిమానులు అయితే సినిమా హిట్ గ్యారంటీ అంటున్నారు.ఇదిలా ఉంటే, ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సీవీఎం) నిర్మిస్తున్నారు. చైతూ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాధ‌వ‌న్, భూమిక‌లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం మరో ప్రధాన ఆకర్షణ. జూన్ 14న విడుద‌ల సిద్ధమవుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ ఫస్ట్‌లుక్‌తో అంచనాలు మరింత పెరిగిపోయాయి. అక్కినేని అభిమానులు అయితే సినిమా హిట్ గ్యారంటీ అంటున్నారు.
Tags: The first sight of the sunshine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *