అమరావతి ముచ్చట్లు:
మేమంతా బస్సుయాత్రలో సీఎం జగన్‌ను కలిసారు రాజీనామా చేసిన వాలంటీర్లు. వైసీపీ ప్రభుత్వం రాగానే వాలంటీర్లను కంటిన్యూ చేస్తూ తొలి సంతకం చేస్తానన్నారు జగన్.పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా స్టే పాయింట్ దగ్గర సీఎం వైయస్ జగన్‌ని రాజీనామా చేసిన వాలంటీర్లు కలిశారు. వారితో అప్యాయంగా మాట్లాడిన జగన్.. అంతా రాజీనామా చేశారా? అని అడిగారు. మన ప్రభుత్వం రాగానే వాలంటీర్ల నియామకంపైనే తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు జగన్. బాగా పనిచేశారు కాబట్టే వాలంటీర్లు అంటే చంద్రబాబుకి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని చెప్పారు జగన్. మన ప్రభుత్వం రాగానే ఇప్పటివరకు ఇచ్చిన సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్నాలు స్టాండర్డ్ చేస్తానన్నారు సీఎం.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో వాలంటీర్ల రాజీనామా కంటిన్యూ అవుతుంది. మూడురోజుల వ్యవధిలో ఇప్పటికే 159మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ఎంపీడీఓ, వార్డు వాలంటీర్ల కమిషనర్ కి రాజీనామా పత్రాలు సమర్పించారు. ఇప్పటివరకూ పెనుగంచిప్రోలులో 100మంది, నందిగామ మండలం మాగల్లులో 27మంది, జగ్గయ్యపేట మున్సిపల్ పరిధిలో 5గురు, జగ్గయ్యపేట మండలంలో 6గురు రాజీనామా చేశారు.వైసీపీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళటానికే రాజీనామాలు చేశామని చెప్పారు. ప్రతిపక్షాలు తమపై విమర్శలు చేయడం నచ్చకే పదవినుంచి తప్పుకుంటున్నాని తెలిపారు. 1వ తారీఖు ఉదయం 5 గంటలకే పెన్షన్ దారులకు పింఛన్ అందిస్తుంటే ఆఆనందం తమకు నచ్చిందన్నారు.
Tags: The first signature was to continue the volunteers when the YCP government came