నైపుణ్యం దిశగా తొలి అడుగు

అమరావతి  ముచ్చట్లు:
నైపుణ్యం దిశగా తొలి అడుగు పడింది. ‘వైయస్సార్ జయంతి’  సందర్భంగా  “స్కిల్ ట్రైనింగ్ అకాడమీ” శంకుస్థాపన జరగనుంది. గురువారం కడప జిల్లా పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా స్కిల్ ట్రైనింగ్ అకాడమీ శంకుస్థాపన జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం నుంచి నైపుణ్య వెలుగులకు అంకురం ఇది. అత్యాధునిక సౌకర్యాలతో 7 ఎకరాల విస్తీర్ణంలో రూ.30 కోట్ల ఖర్చుతో నిర్మించనున్నారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ‘వైయస్సార్ జయంతి’ నాడు ముఖ్యమంత్రి నైపుణ్య కల సాకారానికి మొదటి అడుగు పడటం మంచి పరిణామం. ఉపాధి అవకాశాల కోసం రాష్ట్ర యువత ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. మరికొన్ని రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 25 నైపుణ్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుడతామని అన్నారు. మరో 5 మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ లకూ శ్రీకారం చూట్టబోతున్నారు.
స్కిల్ ఏపీ మిషన్/ నైపుణ్య విశ్వవిద్యాలయం ధృవీకరించిన టెక్నికల్ అండ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్( (TVET) వంటి పరిశ్రమలకు అవసరమైన గ్లోబల్ నమూనా తరహా  అత్యాధునిక కోర్సులతో యువతకు శిక్షణ తరగతులు వుంటాయి. వివిధ రంగాలకు సంబంధించిన పరిశ్రమలలో ఉపాధి అవకాశాలకు తగ్గట్లు అత్యాధునిక హంగులతో  హైఎండ్ ల్యాబ్ల స్థాపనకు పులివెందుల స్కిల్ డెవలప్మెంట్ అకాడమీని తీర్చిదిద్దనున్నారు. నైపుణ్య కళాశాలలో యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలను పెంచేలా సాంకేతిక ,శిక్షణ , అత్యాధునిక కోర్సులు, కొత్త కరికులమ్ వుంటుంది.  రాష్ట్రంలోనే మొట్టమొదటి స్కిల్ ట్రైనింగ్ అకాడమీ పులివెందులలో  ఏర్పాటయింది. పులివెందుల స్కూల్ అకాడమీ ఆర్కిటిక్ డిజైనింగ్ బాధ్యతలను ఏపీయూఐఏఎమ్ఎల్ నిర్వతిస్తోంది. ఇప్పటికే పరిపాలన అనుమతులు , భూసేకరణ పూర్తి అయ్యాయి. త్వరలోనే నిధుల సమీకరణ కొలిక్కి రానుంది.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:The first step towards mastery

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *