మంత్రి మహేందర్ రెడ్డిపై ఉద్యమకారుల మండిపాటు

The flogging of the activists against the minister Mahender Reddy

The flogging of the activists against the minister Mahender Reddy

Date:15/09/2018
చేవెళ్ల ముచ్చట్లు:
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో టిఆర్ఎస్ ఉద్యమకారుల ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టిఆర్ఎస్ మాజీ చేవెళ్ల ఇంచార్జి దేశమల్ల ఆంజనేయులు, తాండూరు ఇంచార్జ్ విజయ్ కుమార్, .. వికారాబాద్ నుంచి శుభప్రద్ పటేల్ హజరయ్యారు.
వారు మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని అన్నారు. జిల్లా మంత్రి మహేందర్ రెడ్డి ఉద్యమకారులను అవమాన పరుస్తున్నారని అన్నారు. ఉద్యమకారులకు పదవులు ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేసారు. ఉద్యమం చేసేటప్పుడు ఎవరైతే కేసులు పెట్టారో వారే జిల్లాను ఏలుతున్నారు. ఉద్యమకారులను ద్రోహులుగా చూస్తున్నారు.
మహేందర్ రెడ్డి మంత్రిగా ఉండి జిల్లాను నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. మంత్రి అనుచరులకే పదవులు ఇచ్చి  ఉద్యమకారులను అణిచివేస్తున్నాడని విమర్శించారు. జిల్లాకు ఒక్క పరిశ్రమకూడా రాలేదు. ఉద్యమ కారులంతా ఏకమైతం. టిఆర్ఎస్ పార్టీ జిల్లాలో నష్టపోతుందని వారు హెచ్చరిచారు.
Tags:The flogging of the activists against the minister Mahender Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *