స్పందనకు సమస్యల వెల్లువ

The flood of problems to the response

The flood of problems to the response

– మున్సిపాలిటిలో 345 వినతులు

Date:15/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమానికి సోమవారం అపూర్వ స్పందన లభించింది. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోను స్పందన కార్యక్రమం నిర్వహించారు. పుంగనూరు మున్సిపాలిటిలో కమిషనర్‌ కెఎల్‌.వర్మ , ఆర్‌వో రామక్రిష్ణ , మేనేజర్‌ రసూల్‌ఖాన్‌ ఆధ్వర్యంలో అన్నిశాఖల అధికారులు కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బాగంగా పట్టణ ప్రజలు 345 మంది హాజరై, తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. అర్జీదారులకు మున్సిపల్‌ కమిషనర్‌ రశీదులను అందజేశారు. అలాగే మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు , ఈవోఆర్‌డి వరప్రసాద్‌ కలసి వినతులు స్వీకరించారు. అలాగే తహశీల్ధార్‌ కార్యాలయంలో డిప్యూటి తహశీల్ధార్‌ మాదవరాజు ఆధ్వర్యంలో వినతిపత్రాలు స్వీకరించారు. పెన్షన్లు, పాసుపుస్తకాలపై ఫిర్యాదులు అందాయి.

జగన్‌ సీఎం కావాలని చేసిన మొక్కులు చెల్లించిన యాదవ్‌

Tags; The flood of problems to the response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *