ఐసోలేషన్‌ కేంద్రాల ఏర్పాజిట్లపై దృష్టి సారించాలి

చౌడేపల్లె ముచ్చట్లు:

 

గ్రామాల్లో ఐసోలేషన్‌ కేంద్రాల ఏర్పాట్లపై దృష్టి సారించాలని ఎంపీడీఓ వెంకటరత్నం సూచించారు. శుక్రవారం మండలంలోని గడ్డంవారిపల్లె, పరికిదొన, ఆమినిగుంట,చారాల , కాగతి, తదితర గ్రామ పంచాయతీలలో పర్యటించారు. ఉన్నతపాఠశాలలు, విశాలమైన ప్రభుత్వ భవన సముదాయాల్లో ప్రజలకు సౌ కర్యంగా అవసరమైన సదుపాయాలను ప్రజాప్రతినిథుల సహకారంతో ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశీంచారు. పెద్దకొండామర్రి, గడ్డంవారిపల్లె, కాటిపేరి గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ కేంద్రాలను పరిశీలించారు. 45 యేళ్ల వయస్సుకు పైబడిన వారందరికీ తప్పకుండా వ్యాక్సిన్‌ వేసుకోవాలని , వలంటీర్లు చైతన్యం కల్పించాలని సూచించారు. ఆయన వెంట సర్పంచ్‌ లు భాగ్యవతి, లక్ష్మిదేవి , గ్రామస్తులు రెడ్డెప్పరెడ్డి, హరి తదిత రులున్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags: The focus should be on the arrangement of isolation centers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *