Natyam ad

ముగ్గురు వేటగాళ్లును అదుపులో తీసుకున్న ఫారెస్ట్ అధికారులు..

-వేటగాళ్లు ఉపయోగించిన తుపాకీ , రెండు వాహనాలు సీజ్

 

ఖమ్మం ముచ్చట్లు:

Post Midle

ఖమ్మం జిల్లా మధిర రేంజ్‌లోని ఎర్రుపాలెం మండలం భీమవరం రిజర్వ్ ఫారెస్ట్ కంపార్ట్‌మెంట్ నంబర్ 64లోని అయ్యవారిగూడెం గ్రామంలో శుక్రవారం (మే 3 2024) రాత్రి వేటగాళ్లు తుపాకీ, బుల్లెట్లతో వేటకు ప్రయత్నించిన ఇద్దరు వేటగాళ్లను అటవీశాఖ అధికారులు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో అదుపులో తీసుకున్నట్లు డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ ఖమ్మం, సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఐఎఫ్ఎస్ ,స్థానిక ఫారెస్ట్ ఆఫీసు నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పల నేతృత్వంలోని ఫారెస్ట్ అధికారుల బృందం విశ్వసనీయ సమాచారం మేర సురేష్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బెమ్మారం సంఘటనా స్థలానికి చేరుకుని వేట కోసం అడవి జంతువుల వేటలో ఉన్న వేటగాళ్లను గుర్తించారు.

 

వేటగాళ్లు తమ గుర్తింపును ఏ1ఏ గా వెల్లడించారు.ఏ1 గా శ్రీనివాస్ వయస్సు 52, వినగడప, అతని తండ్రికి తుపాకీ ఉండటంతో గతంలో వేటకు ఉపయోగించే తుపాకీ ప్రాక్టీస్ చేశాడు.ఏ 2.పి కృష్ణారావు వయస్సు 53, కొత్తపల్లి, అతను ఏ1, ఏ 3 స్నేహితుడు. పి.మారేశ్వరరావు, అతను ఆటో డ్రైవర్ కమ్ మీట్ సెల్లర్ మరియు ఏ4 పరారీలో ఉన్నాడు. ఏ1, ఏ2, ఏ4 ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాకు చెందినవారు, ఏ3 తెలంగాణ మధిర మండలానికి చెందినవారుగా తెలియజేశారు.వేటగాళ్ల వద్ద రెండు ద్విచక్ర వాహనాలును అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకొని వాహనాలను సీజ్ చేశారు.వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద వారిని అరెస్టు చేసి మధిర క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.

 

సాహసంతో ఆపరేషన్ లో పాల్గొని విజయాన్ని సాధించిన విజయలక్ష్మి, ఎఫ్ ఆర్ వో మధిర, యు . సురేష్, ఎఫ్ ఎస్ ఓ భీమవరం, బి .నాగేశ్వరరావు, ఎఫ్ బి ఓ, ఎం . రమేష్ ఎఫ్ బి ఓ, ఎల్ . సురేష్, ఎఫ్ బి ఓ , పి . శ్రీనివాస్ ఎఫ్ బి ఓ , బి . రాజేందర్ ఎఫ్ బి ఓ , రాంబాబు ఎఫ్ బి ఓ వారందరికీ రాష్ట్రస్థాయిలో అవార్డుల అందించవలసిందిగా సిఫారస్ చేయనున్నట్లు సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఐఎఫ్ఎస్సి విలేకరుల సమావేశంలో తెలియజేశారు.

 

Tags; The forest officials took three poachers into custody.

Post Midle