కాషాయ నేతల మాటల కోటలు

విజయవాడ ముచ్చట్లు:


ఏపీలో బీజేపీకి ఎలాంటి పొలిటికల్ స్టేకూ లేదు. కానీ బీజేపీ నేతల మాటలు మాత్రం కోటలు దాటేస్తున్నాయి. గ్రామాల్లో పండుగలు, పబ్బాల సమయంలో వచ్చి వినోదాన్ని పంచే పిట్టల దొరలు  కూడా ఈ స్థాయిలో గొప్పలు చెప్పి వినోదాన్ని పంచలేరు. కానీ బీజేపీ ఏపీ నేతలు మాత్రం.. గొప్పలు చెప్పుకోవడంలో, అతిశయోక్తులు చెప్పడంలో ఇప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డులూ చెరిపేస్తున్నారు.రాష్ట్రంలో బీజేపీకి  175  నియోజకవర్గాల్లొ ఒక్కరంటె ఒక్క అబ్యర్దిగా చెప్పుకో దగ్గ నేత  లేరు. అయినా ముఖ్యమంత్రి అభ్యర్ది ని డిసైడ్ చేస్తాం…..బిజెపి తో పొత్తులు కొసం అన్నీ పార్టీ లు ఎగబడుతున్నాయి అంటూ బడాయి మాటలు మాటాడు తున్నారు.  ఢిల్లీకి పోయో నేతలు   అందరూ బడా బాబులే.. కాని స్థానికంగా పార్టీని నడిపించే వారులేక ఉన్న పదిమందికూడా ఏదో ఒక పార్టీ నేతలతొ కలిసి తిరుగుతున్నారు.బిజెపి పార్టీ గొప్పల గురించి చాంతాడంత గొప్పలు చెప్పే సోము వీర్రాజు. ‌..అండ్ కో‌  నేతలు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కు అబ్యర్ది లేక ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్ ను బరిలో దించింది.  దింగత మేకపాటి గౌతమ్ రెడ్డి. మరణం తరువాత ఉప ఎన్నికలు తధ్యమని తెలిసినా ఇన్ని నెలలు అక్కడ బిజెపి అబ్యర్ది ఎవరన్నది నిర్ణయం చేయలేకపోయింది. ఇక కడాఖరుకు పరువు పోతుందని ఆఖరి రోజు ఆ పార్టీ జిల్లా అద్యక్షుడి చేత నామినేషన్ వేయించి సోము వీర్రాజు ఓ రేంజ్ లో కేకలు వేసి వైసిపికి సవాల్ విసిరి వెళ్లిపోయారు.వెళుతూ వెళుతూ టిడిపి ఎలాగూ పోటీలో లేదు కదా మీకు వైసిపి పార్టీ మీద కోపం ఉంటే మాకు ఓట్లేయండి అని ప్రాధేయపడి వెళ్లారు. ఇంతకు ఉప ఎన్నికల్లో స్థానికంగా ఉన్న నేతలను పోటీలో నిలబెట్టే దిక్కులేని దశలో బిజెపి పార్టీ ఉంది.అలాంటి పార్టీ పక్క పార్టీలను శాసిస్తామని కొతలు కోసి వెళతుంటే ప్రజలు విరగబడి నవ్వుకుంటున్నారు. గతంలో బద్వేల్ , తిరుపతి ఉప  ఎన్నకల్లో పోటీ చేసి డిపాజిట్ కొల్పోయిన బిజెపి ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో   పోటీ చేసి ఏం సాధించాలనుకుంటోంది? మరోసారి డిపాజిట్ గల్లంతు చేసుకోవడం తప్ప.  నామి నేషన్ రోజున వచ్చిన నేతలు మళ్లి కనిపించక పోవడంతో ఆ పార్టీ నేతలను సామాజిక మాధ్యమంలో సెటైర్లతో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

 

Tags: The forts of the words of the Kashaya leaders

Post Midle
Post Midle
Natyam ad