Natyam ad

గడపగడపలోనూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు

ఆముదాలవలస ముచ్చట్లు:


రాష్ట్రం లో ముఖ్యమంత్రిగా వైయస్ ఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మి సీతారాం పేర్కొన్నారు. సరుబుజ్జిలి మండలం మతలబుపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసి ఆర్ధిక భరోసా కల్పిస్తున్నారన్నారు.నిరుపేదల గౌరవాన్ని పెంచేలా జగన్ ప్రభుత్వo అడుగులు వేస్తుందన్నారు.ఈ సందర్భంగా అందులో ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాల లబ్ధి ఏ మేరకు చేకూరురుతుందో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన, ఆశయానికి ప్రతిరూపంగా ఉన్న గడపగడపకు మన ప్రభుత్వ లక్ష్యం ఉద్దేశాన్ని ఆయన ప్రజలకు వివరించారు.నాడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర లో ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా చూశారన్నారు.

 

 

నేను విన్నాను.. నేను ఉన్నాను ఉంటూ ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామంటూ భరోసా కల్పించారన్నారు.ఇచ్చిన హామీలను నెరవేర్చామని చెబుతూ మిగిలిన ప్రజాసమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యం అన్నారు.సాంకేతిక పరమైన సంక్షేమ పథకాలు అందకపోతే,  గ్రామ సచివాలయం ద్వారా దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు.ప్రతి గ్రామంలో జరిగిన అభివృద్ధి,  సంక్షేమం ప్రజానీకం ముందు ఉంచేందుకు ఇది ఒక చక్కటి కార్యక్రమం అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రభుత్వ పథకాల లబ్ధిని, కలిగే ప్రయోజనాలను ప్రతి గడపకు వివరిస్తుంటే ప్రజల ముఖాన ఆనందం కనిపిస్తుంది అని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రంలో ప్రతి నియోజవర్గం లో విజయవంతం అయిందని అన్నారు.ఇంతటి మంచి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లడం ఒక శుభ పరిణామంగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కె వి జి సత్యనారాయణ, జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరావు, మండల పార్టీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ బెవర మల్లేశ్వరరావు, పి ఎ సి ఎస్ అధ్యక్షులు కోవిలాపు చంద్రశేఖర్, స్థానిక సర్పంచ్ కృష్ణ తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలు మరియు ఎంపీడీవో, ఎంఈఓ, ఏపీవో, అగ్రికల్చర్ ఏవో, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: The fruits of the government’s welfare

Post Midle