The fruits of the zodiac today

ఈనాటి రాశి ఫలాలు

Date:29/12/2019

ఈనాటి రాశి ఫలాలు

మేషరాశి: వార్తా సిబ్బందికి చిన్న చిన్న తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. రవాణా రంగంలోని వారికి చికాకులు అధికమవుతాయి. గృహ సామగ్రి, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. మత్స్య, కోళ్ల వ్యాపారస్తులకు కలిసివస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత చోటుచేసుకుంటుంది. బంధువులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. రాశిచక్ర అంచనాలు

వృషభరాశి: స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం. ఆకాల భోజనం వల్ల మీ ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. ప్రేమ వ్యవహారాల్లో చికాకు లెదురవుతాయి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మిథునరాశి: పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. బంధుమిత్రులతో పట్టింపులు, చికాకులు ఎదుర్కొంటారు. విద్యార్థులు పై చదువుల కోసం దూర ప్రదేశానికి వెళ్ళవలసివస్తుంది. ఖర్చులు పెరిగినా ఇబ్బందులు వుండవు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి.

కర్కాటకరాశి: వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. సాహస ప్రయత్నాలు విరమించండి. కానివేళలో బంధుమిత్రుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. సామూహిక దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒక స్థిరాస్తి విక్రయానికి అడ్డంకులు తొలగిపోగలవు.

సింహరాశి: హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి చూడాల్సి వస్తుంది. స్త్రీలు కళాత్మక పోటీల పట్ల ఆసక్తి చూపిస్తారు. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించే వారుండరు. పెరిగిన ధరలు చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు.

కన్యరాశి: కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం వరిస్తుంది.

తులరాశి: ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ బలహీనతలు, ఆగ్రహావేశాలు ఇబ్బందులకు దారితీసే ఆస్కారం ఉంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ అవసరం. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. గృహంలో మార్పులు, చేర్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

వృశ్చికరాశి: ఆర్థిక ఇబ్బంది లేకపోయినా సంతృప్తి కానరాదు. బంధువుల రాకతో స్త్రీలకు అసౌకర్యం, చికాకులు తప్పవు. అయిన వారి కోసం తాపత్రయపడతారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు పనిభారం అధికం. ఫైనాన్స్, చిట్స్, బ్యాంకింగ్ రంగాలలో వారికి మెళకువ అవసరం. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది.

ధనస్సురాశి: మీ చెంత ధనం ఉందన్న విషయాన్ని గోప్యంగా ఉంచండి. బాకీలు, ఇంటి అద్దెల వసూళ్లలో సంయమనం పాటించండి. ఒక మంచి చేశామన్న భావం సంతోషం కలిగిస్తుంది. స్త్రీలకు చురుకుతనం, పనియందు ధ్యాస చాలా అవసరం. పెద్దమొత్తం సరుకు నిల్వలో వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి.

మకరరాశి: సోదరీ, సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. విదేశీయానం కోసం చేసే యత్నాలు కలిసివస్తాయి. ఏదైనా స్థిరాస్తి అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడటం మంచిది. మీ అతిచనువును ఇతరులు అపార్థం చేసుకునే ఆస్కారం వుంది. జాగ్రత్త వహించండి. పాత పరిచయస్తులు, ఆప్తులను కలుసుకుంటారు.

కుంభరాశి: బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. నూతన దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. తలపెట్టిన పనిలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తిగా పూర్తి చేస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. దూర ప్రయాణాల్లో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మీనరాశి: బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి. పాత బాకీలు తీరుస్తారు. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా పడటంతో కొంత నిరుత్సాహానికి గురవుతారు. ఎన్ని అవరోధాలు తలెత్తిన వ్యాపార రంగంలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది.

 

News staff have a chance to make a few minor mistakes

 

Tags:The fruits of the zodiac today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *