The fruits of the zodiac today

ఈనాటి రాశి ఫలాలు

Date:03/01/2020

ఈనాటి రాశి ఫలాలు

మేషరాశి : ఆర్థిక కార్యకలాపాలు చాలా సమర్థవంతంగా నడుపుతారు. ఉన్నట్టుండి వేదాంత ధోరణి కానవస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం.

వృషభరాశి : పోస్టల్, టెలిగ్రాఫిక్ రంగాలవారికి సంతృప్తినిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. సిమెంట్, ఐరన్ వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. నూతన పరిచయాలు విస్తరిస్తాయి. ఊహించని చికాకులు తలెత్తి తెలివితో పరిష్కరిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది.

మిథునరాశి : పందాలు జూదాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాంట్రాక్టర్లకు నూతన అవకాశాలు లభించినా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. మీ సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహంతో వ్యవహరించండి.

కర్కాటకరాశి : ప్రైవేటు సంస్థలలోని వారికి బరువు బాధ్యతలు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ పనులు మందకొడిగా సాగటం, జాప్యం వంటి చికాకులు ఎదుర్కొంటారు. పారిశ్రామిక సంబంధ, బాంధవ్యాలు మెరుగగలవు. బంధు, మిత్రుల రాకవల్ల గృహంలో సందడి కానవస్తుంది.

సింహరాశి : యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు విస్తరిస్తాయి. మీ ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి ఉంటుంది. కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగాల వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పిత్రార్జిత ఆస్తిని అమ్మటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్యరాశి : వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్తులకు లాభదాయకం. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. నూతనంగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి నిరంతర శ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు.

తుల రాశి: నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ మనోభావాలకు మంచి స్పందన లభిస్తుంది. స్త్రీలకు అపరిచత వ్యక్తుల విషయంలో మెళకువ అవసరం. ఖర్చులు పెరగడంతో కుటుంబంలోని రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికరాశి : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడేందుకు సన్నిహితుల సాయం కోరుతారు. తరచూ దేవాలయ సందర్శనం చేస్తారు. మీ కళత్రమొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. విలువైన ఆస్తులు కొనుగోలు చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు.

ధనస్సురాశి : ఉమ్మడి ఆర్థిక లావాదేవీలలో మాటపడవలసి రావొచ్చు. మీ ప్రయత్నాలకు సన్నిహితుల చేయూత లభిస్తుంది. గతానుభవంతో లక్ష్యం సాధిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు, వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. నిర్మాణ పథకాలలో పురోభివృద్ధి కానవస్తుంది. ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వ చేయలేకపోతారు.

మకరరాశి : స్త్రీలు అదనపు సంపాదన దిశగా తమ ఆలోచనలు సాగిస్తారు. గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ అంచనాలు నిజమైన ఊరట చెందుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. పరోపకారానికి పోయి సమస్యలను తెచ్చుకుంటారు. బ్యాంకు ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి.

కుంభరాశి : వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. ప్రతి విషయంలోనూ మౌనం వహించండి మంచిది అని గమనించండి. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ వాక్‌చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. సంఘంలో గౌర ప్రతిష్టలు పెరుగుతాయి. పెట్టుబడుల కోసం పనులు ముమ్మరం చేస్తారు.

మీనరాశి: రియల్ ఎస్టేట్, ఏజెంట్లకు బ్రోకర్ల శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్త్రీలకు వస్తు, వస్త్ర, ఆభరణాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. రవాణా రంగంలోని వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. దీర్ఘకాలిక రుణాలు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. రాజకీయ పార్టీల నాయకులకు ఒక స్థాయి పెరుగుతుంది.

 

ఈనాటి పంచాంగం

 

Tags:The fruits of the zodiac today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *