ఈనాటి రాశి ఫలాలు

Date:04/01/2020

ఈనాటి రాశి ఫలాలు

మేషరాశి….
పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలవారికి అధిక ఒత్తిడి, చికాకులు తప్పవు. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. దైవ కార్యక్రమాలలో చురకుగా పాల్గొంటారు. గృహంలో మార్పులకై చేయ ప్రయత్నాలు వాయిదాపడతాయి. పాత వస్తువులను కొని సమస్యలను తెచ్చుకోకండి. అదనపు బరువు, బాధ్యతలు స్వీకరిస్తారు.

వృషభరాశి….
వ్యాపార, వ్యవహారాలలో దక్షత చూపుతారు. కార్యసాధనలో ఆత్మవిశ్వాసం, మొండి ధైర్యంతో ముందుకుసాగండి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. పట్టుదలతో శ్రమిస్తే కానిపనులు నెరవేరవు. ఐరన్, కలప, ఇటుక, ఇసుకవ్యాపారులకు మిశ్రమ ఫలితం.

మిథునరాశి….
కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు పనిలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. విలువైన వస్తువులు, పత్రాలు చేజారిపోయే ఆస్కారం ఉంది. విద్యార్ధుల్లో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది.

కర్కాటకరాశి….
నిరుద్యోగులకు లభించిన తాత్కాలిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. అనుకున్న పనులు శ్రమించిన మీదట ఫలించగలవు. స్త్రీల అభిప్రాయాలకు, ఆలోచనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఏజెంట్లు, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు.

సింహరాశి….
రాతకోతల విషయంలో పొరపాట్లు జరుగకుండా సరిచూసుకోండి. దూరప్రయాణాలలో మెళకువ వహించండి. వైద్య రంగంలోని వారికి అనుకూలత. పాతమిత్రుల కలయిక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. మీ జీవిత భాగస్వామి సలహాతో ఒక అవకాశాన్ని మలచుకుంటారు. బిల్లులు చెల్లిస్తారు.

కన్యరాశి…
నూనె, కంది, ఎండుమిర్చి, బెల్లం, ఉల్లి వ్యాపారస్తులకు పురోభివృద్ధి చేకూరుతుంది. విదేశాలు వెళ్లటానికి మీరు చేయు ప్రయత్నాలు విఫలమౌతాయి. ధనం సమయానికి అందటంవల్ల సంతృప్తి కానవస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి సంతృప్తి చేకూరుతుంది. స్త్రీలు పూజా కార్యక్రమాలలో హడావిడిగా ఉంటారు.

తులరాశి….
రాజకీయాలలోని వారు కొన్ని అంశాలపై చర్చలు జరపుటవల్ల విజయం వరిస్తుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలందు ఉన్న వారికి ఆదాయం బాగుంటుంది. కుటుంబంలో అదనపు బరువు బాధ్యతలు అధికమవుతాయి. విద్యార్ధుల ఆలోచనలు పక్కదారి పట్టేందుకు ఆస్కారం ఉంది.

వృశ్చికరాశి…
చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. స్త్రీలకు కాళ్లు, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. రావలసిన ధనం అందటంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి.

ధనస్సురాశి….
ఇప్పటి వరకు విరోధులుగా ఉన్న వ్యక్తులను సుముఖం చేసుకోగలుగుతారు. రుణం ఏకొంతైనా తీర్చలన్న మీ ఆలోచన వాయిదా పడుతుంది. వ్యాపారులకు పోటీ పెరగటంతో ఆశించినంత ఆర్థిక సంతృప్తి ఉండదు. ఉపాధ్యాయులతో విద్యార్ధులు ఏకీభవించలేకపోతారు. ఏ వ్యక్తినీ అతిగా విశ్వసించటం మంచిదికాదని గమనించం

మకరరాశి….
ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపుల విషయంలో సంతృప్తి కానరాగలదు. గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల వర్తమానంలో ఇబ్బందులెదుర్కొంటారు. సంగీత, సాహిత్య, కళా, పత్రికా రంగాల్లో వారికి గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి.

కుంభరాశి….
గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. సంతాన విషయంలో సంజాయిషీలు ఇచ్చుకొనవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాతపరీక్షలలో మెళుకువ అవసరం. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవటంతో ఇబ్బందులెదుర్కొంటారు. ముఖ్యులతో ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించండి.

మీనరాశి….
ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు బాధ్యతారహితంగా వ్యవహరించటం వల్ల మాటపడక తప్పదు. కొంతమంది. మిమ్ములను తప్పుదోవ పట్టించి లబ్ధి పొందటానికి యత్నిస్తారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.

 

‘అల వైకుంఠపురంలో..’ సెన్సార్ పూర్తి

 

Tags:The fruits of the zodiac today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *