The fruits of this day's zodiac

ఈ నాటి రాశి ఫలాలు

Date:12/12/2019

రాశి ఫలాలు

మేష రాశి :
సినిమా, కళా రంగాల్లో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు బంధువుల రాకవల్ల పనులు వాయిదాపడుతాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.

వృషభ రాశి :
ఉద్యోగస్తులు అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి ఉంటుంది. పత్రికా సంస్థల్లోని వారికి ఏకాగ్రత, పునఃపరిశీలన ప్రధానం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు, ఆందోళన కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ రూపొందించుకుంటారు.

మిథున రాశి :
వ్యాపారాల్లో కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలతో వినియోగదారులను ఆకట్టుకుంటారు. ఉత్తర, ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఆకస్మిక ఖర్చులు, చెల్లింపుల వల్ల ఒడిదుడుకులు తప్పవు. పెంపుడు జంతువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. మార్కెట్ రంగాల వారికి శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం అంతగా ఉండదు.

కర్కాటక రాశి :
చిత్తశుద్ధితో మీరు చేసిన సహాయానికి, సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. పెద్దల జోక్యంతో అనుకోకుండా ఒక సమస్య సానుకూలమవుతుంది. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది.

సింహ రాశి :
ప్రతి విషయంలోనూ ఓర్పుతో వ్యవహరించాలి. రుణాలు తీరుస్తారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. రాజకీయ నాయకులు అధికారులతో సమావేశాలు, పర్యటనల్లో పాల్గొంటారు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది.

కన్య రాశి:
ఉద్యోగయత్నంలో బిడియం, భేషజం తగదు. దాన ధర్మాలు చేసి సంఘంలో మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. మీ అభిప్రాయాలను మీ శ్రీమతికి సూచనప్రాయంగా తెలియజేయండి.

తుల రాశి:
ప్రైవేటు సంస్థలలో వారికి తోటి వారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. దైవ, సేవాకార్యక్రమాల కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.

వృశ్చిక రాశి :
స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగ ప్రకటనలపై ఏకాగ్రత వహించండి. స్థిరాస్తి విక్రయంలో తొందరపాటు తగదు. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహం కలిగిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.

ధనస్సు రాశి:
వ్యాపారస్తులు ఊహించని లాభాలను సొంతం చేసుకుంటారు. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రవాణా, మెకానిక్ రంగాల్లో వారికి చికాకులు తప్పవు.

మకర రాశి :
శత్రువులు సైతం మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసివుంటుంది. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు వృత్తిపరమైన చికాకులు ఎదుర్కోవలసివస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

కుంభ రాశి :
వస్త్ర వ్యాపారులకు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. స్త్రీలతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. రిప్రజెంటేటివ్‌లకు, ఉపాధ్యాయులకు, మార్పులు అనుకూలిస్తాయి. పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు.

మీన రాశి :
ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. స్త్రీలకు కోరుకునే మార్పులు నిదానంగా అనుకూలిస్తాయి. మీ సాయంతో ఒకరికి ఉద్యోగవకాశం లభిస్తుంది. సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. ఆడిటర్లకు, అకౌంట్లకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. రావలసిన మొండిబాకీలు వాయిదాపడతాయి.

పేద ప్రజలపై ఆర్టీసీ ఛార్జీల పెంపు అదనపు భారం

 

Tags:The fruits of this day’s zodiac

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *