The fruits of this day's zodiac

ఈ నాటి రాశి ఫలాలు

Date:11/12/2019

రాశి ఫలాలు

మేష రాశి :
దైవ, సామాజిక, సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి నెలకొంటుంది. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తికానవస్తుంది. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. సభా సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. హోటల్, కేటరింగ్ పనివారలకు, వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి.

వృషభం రాశి:
తలపెట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. నిరుద్యోగులు ఇచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవడం శ్రేయస్కరం. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. తోటల రంగాల వారి ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.

మిథున రాశి :
శ్రీమతి సలహా పాటించడం వల్ల ఒక సమస్య నుంచి బయటపడతారు. ప్రైవేటు ఫైనాన్సుల్లో పొదుపు చేయడం మంచిదికాదని గమనించండి. పత్రికా రంగంలోని వారికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు, మార్పులు, చేర్పులకు అనుకూలం. దుబారా ఖర్చులు అధికం.

కర్కాటక రాశి :
పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. స్త్రీలకు ఇంటి వాతావరణం చికాకు కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. మార్కెట్ రంగాలవారు టార్గెట్లను సునాయాసంగా పూర్తిచేస్తారు.

సింహ రాశి :
కానుకలిచ్చే విషయంలో దంపతుల మధ్య ఏకాభిప్రాయం ఉండదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారస్తులకు సమస్యలు తలెత్తుతాయి. పెద్దమొత్తం నగదుతో ప్రయాణం క్షేమంకాదు. రాజకీయాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది.

కన్య రాశి:
బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. కాంట్రాక్టులు, లీజు, ఏజెన్సీలు, టెండర్లకు అనుకూలం. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. పెద్దల సలహాను పాటించడం మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వాహన చోదకులకు అప్రమత్తత అవసరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.

తుల రాశి:
ఆర్థిక లావాదేవీల్లో ఒత్తిడి, హడావుడి అధికంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కలప, ఇటుక, ఇనుము, వ్యాపారస్తులకు కలిసిరాగలదు. పరోపకారానికి పోయి సమస్యలు తెచ్చుకోవడం మంచిదికాదు.

వృశ్చిక రాశి :
ప్రింటింగ్ రంగాల వారికి పనివారిలతో చికాకులు తప్పవు. హామీలకు దూరంగా ఉండటం మంచిది కాదని గమనించండి. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బంధువుల రాకతో పనులు అసంపూర్తిగా ముగించవలసి వస్తుంది. విద్యార్థినిలు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.

ధనస్సు రాశి:
స్త్రీలకు అలంకారం, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. మీ ఏమరపాటుతనం వల్ల పత్రాలు, విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. రుణం కొంత మొత్తం చెల్లించి రుణదాతలను సంతృప్తిపరుస్తారు. పెద్దలతో ఏకీభవించలేకపోతారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి.

మకర రాశి :
బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. ఒప్పందాలు, హామీలకు సంబంధించిన విషయాల్లో పునరాలోచన అవసరం. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహిచండి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.

కుంభ రాశి :
ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉండటం వల్ల పొదువు సాధ్యంకాదు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత వంటివితప్పవు.

మీన రాశి :
ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. బంధువుల ఆకస్మిక రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులు చంచల స్వభావం విడనాడి కృషి చేసిన సఫలీకృతులవుతారు. కోళ్ల, మత్స్యు, గొర్రెల వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది.

 

నేటి పంచాంగం

 

Tags:The fruits of this day’s zodiac

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *