కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి

The future Chief Minister YS Jaganmohan Reddy

The future Chief Minister YS Jaganmohan Reddy

– పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి

Date:17/03/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రనికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అని తంబళ్లపల్లె వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పుంగనూరులో రావాలి జగన్‌…కావాలి జగన్‌ ర్యాలీని ప్రారంభించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి అక్రమాలలో కూరుకుపోయిందన్నారు. ప్రజల సంక్షేమాన్ని విస్మరించి , కేవలం పార్టీ నేతల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదేనన్నారు. ఇంతటి అవినీతి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశంకు తగిన గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే నవరత్నాల కార్యక్రమాలను అమలు పరచి, అన్ని వర్గాలను అభివృద్ధి చేయడమే వైఎస్సార్‌సీపీ లక్ష్యమన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, రాజంపేట పార్లమెంట్‌ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డికి ఫ్యాన్‌ గుర్తుపై రెండు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, కౌన్సిలర్లు శోభారాణి, అమ్ము , ఆసిఫ్‌, పార్టీ నేతలు సుబ్బమ్మ, ఆర్‌విటి బాబు, గంగాధర్‌, వెంకటేష్‌, కిట్టా, గురుప్రసాద్‌, రాజేష్‌, హేమంత్‌, సురేష్‌, బావాజాన్‌ తదితరులు పాల్గొన్నారు.

జనసేన పార్టీ బలోపేతం

Tags: The future Chief Minister YS Jaganmohan Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *