ఏపికి అన్యాయం చేసిన బిజెపి భవిష్యత్తు తరాల ప్రజలు కూడా క్షమించరు

AP Chief Minister Chandrababu Naidu said that the BJP, which has been unfair to Andhra Pradesh, will not forgive people of future generations.

AP Chief Minister Chandrababu Naidu said that the BJP, which has been unfair to Andhra Pradesh, will not forgive people of future generations.

Date:19/09/2018
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి ముచ్చట్లు :
ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన బిజేపిని ఈ తరాలే కాదు భవిష్యత్తు తరాల ప్రజలు కూడా క్షమించరని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక హోదా, రాష్ట్ర పునర్విభజన చట్టంపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ‘‘విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని దిల్లీకి వెళ్లి ప్రధాని, పలువురు కేంద్రమంత్రులు, అధికారులను స్వయంగా కలిసి సంప్రదింపులు జరిపినా.. వివిధ రూపాల్లో నిరసనలు తెలిపి ఒత్తిడి పెంచినా కేంద్రం తన తీరును మార్చుకోకుండా మొండిగా వ్యవహరించడాన్ని శాసనసభ తీవ్రంగా గర్హిస్తున్నది.
ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పనప్పుడు ప్రస్తుతం హోదా లబ్దిని పొందుతున్న 11 రాష్ట్రాలకు ఆ ప్రయోజనాలను కొనసాగిస్తున్నప్పుడు ఏపీకి ఇచ్చిన ఆ హామీని ఎందుకు నెరవేర్చరని అసెంబ్లీ ద్వారా కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాం. మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ పట్ల అవలంబిస్తున్న వివక్షపూరిత ధోరణి భారత ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని సభ అభిప్రాయపడుతోంది.
ఏపీకి తప్పనిసరిగా పన్ను రాయితీలతో కూడిన ప్రత్యేక హోదాను ఇవ్వాలని, నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇచ్చిన హామీలతో పాటు చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను సంపూర్ణంగా అమలుచేయాలని సభ డిమాండ్‌ చేస్తోంది. ఈ హామీలు నెరవేర్చడం ద్వారా పార్లమెంట్‌ వ్యవస్థ గొప్పతనాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని కేంద్రం గౌరవించాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నాం’’ అని చంద్రబాబు తీర్మానం చదివి విన్పించారు. సీఎం ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు సమర్థించారు.
Tags:The future generations of BJP, who have been blamed for wrongdoing, will not be forgiven

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *