The game of three doctors at Punganur Ph.D.

పుంగనూరు పిహెచ్‌సీలో ముగ్గరు డాక్టర్ల ఆట

– ఆగిన సిబ్బంది జీతాలు
– ఆందోళనలో సిబ్బంది

Date:03/06/2020

పుంగనూరు ముచ్చట్లు:

కరోనా నియంత్రణలో వైద్య సిబ్బంది సేవలు ప్రశంసనీయం. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పిహెచ్‌సీలో ముగ్గ్గరు డాక్టర్ల పెత్తనంతో సిబ్బంది నెల జీతాలు రాక ఆందోళన చెందుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ముడిబాపనపల్లె పిహెచ్‌సీలో డాక్టర్‌ పవన్‌కుమార్‌ గత ఏడాది పని చేసి బదిలీపై వెళ్లారు. ఈయన స్థానంలో డాక్టర్‌ సోనియా పదవి బాధ్యతలు చేపట్టారు. కొద్దినెలల కాలంలోనే డాక్టర్‌ సోనియా విధుల్లో నిర్లక్ష్యం వ హించడంతో అధికారుల ఫిర్యాదు మేరకు డిఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ పెంచలయ్య ఆమెను గత రెండు నెలల క్రితం మదనపల్లెకు బదిలీ చేశారు. ఆమె స్థానంలో చౌడేపల్లె మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌ను నియమించారు. ఇలా ఉండగా డాక్టర్‌ సోనియా రెండు నెలలు గడచినా తన బాధ్యతలను డాక్టర్‌ శ్రీకాంత్‌కు అప్పగించలేదు. దీని కారణంగా రోజు వారి చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడటంతో దీనిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. డిఎంఅండ్‌హెచ్‌వో స్పందించకపోవడంతో ముడిబాపనపల్లె పిహెచ్‌సీలో ముగ్గరు డాక్టర్ల ఆటకు వైద్య సిబ్బంది బలౌతున్నారు. ఇలా ఉండగా ప్రతి నెల వైద్య సిబ్బందికి 1న జీతాలు చెల్లిస్తారు. కానీ ఈ నెల జీతాల బిల్లు పెట్టినా ఎస్టీవో బిల్లు ఆమోదించకపోవడంతో జీతాలు పెడింగ్‌ పడి వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కారణాలు ఇవే…

ప్రతి నెల బిల్లులు మంజూరు చేయాలంటే ఎస్టీవో ఆఫీస్‌లో బయోమెట్రిక్‌ ద్వారా మెడికల్‌ ఆఫీసర్‌ ఆమోదం చేయాలి. ఆన్‌లైన్‌లో డాక్టర్‌ పవన్‌కుమార్‌ , డాక్టర్‌ సోనియా చేతి గుర్తు వేయాల్సి ఉంది. వారిరువురు బాధ్యతలు ఇవ్వకపోవడంతో డాక్టర్‌ శ్రీకాంత్‌ బయోమెట్రిక్‌ వేసేందుకు వీలులేదు. బిల్లులు ఒకరు రాయడం, బయోమెట్రిక్‌ ఒకరు చేయాల్సి ఉండటంతో ఎస్టీవో కార్యాలయంలో జీతాలకు బ్రేక్‌ పడింది. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా వెంటనే చర్యలు తీసుకుని జీతాలు పంపిణీ చేయించి, డాక్టర్‌ శ్రీకాంత్‌కు బాధ్యతలు అప్పగించేలా ఆదేశించాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎస్టీవో ఆఫీస్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ సురేషన్‌ను విచారించగా డ్రాయింగ్‌ అధికారులు ఇద్దరు ఉన్న కారణంగా బిల్లును సరిచేసుకుని రావాలని త్రిప్పిపంపామన్నారు.

బీజేపీతో పెద్ద తలనొప్పి

Tags: The game of three doctors at Punganur Ph.D.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *