సోంపాళ్యం ఆలయంపై ముఠా కన్ను

The gang eye on the Temple of the Solidarity

The gang eye on the Temple of the Solidarity

–గుప్త సంపద ఉందనే?
–2009 చొరబాటు దారులను గాలికొదిలేశారు
–కేసు నమోదు చేయని పోలీసులు

Date:22/09/2018

ములకలచెరువు ముచ్చట్లు:

ములకలచెరువు మండలం సోంపాళ్యంలోని విజయనగర పాలకులు నిర్మించిన చెన్నకేశవ ఆలయంపై గుప్త న్యిధుల ముఠాలు కన్నేశాయి. ఇప్పటికే పలుమార్లు గుప్త న్యిధుల కోసం ముఠాల ప్రయత్నాలు ఫలించలేదు. అయితే దీనిపై ముఠాల ప్రయత్నాలు విరమించలేదని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఆలయం పరిసర ప్రాంతాల్లో అనుమానితులు సంచరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

2009 ఆగస్టు 30న ఓ ముఠా సామాగ్రితో ఆలయంలోని గర్భగుడిలో తవ్వకాలు జరిపేందుకు ఆదివారం తెల్లవారుజామున చొరబడిన ముసుగు దొంగల ఉదంతం తెలిసిందే. అయితే ఈ చొరబాటుపై అప్పట్లో ములకలచెరువు పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ముసుగు దొంగలు ఎవరన్నది మిస్టరీగా మిగిలిపోయింది. 15వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. గర్భగుడిలో చెన్నకేశవ విగ్రహం ప్రతిష్టించారు.

 

 

విజయనగర రాజుల పాలనలో చెన్నకేశవ ఆలయాన్ని అత్యంత అద్భుతంగా నిర్మించారు. ఆలయంలో అణువణువు శిల్పకళ ఉట్టిపడుతోంది. గుడి నిర్మించేందుకు ఉపయోగించిన ప్రతి రాయిపైనా శిల్పకళ అలరారుతోంది. ఇవన్నీ ప్రాచీన శిల్పాల కావడంతో దుండగులు వీటిపై దష్టి పెట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళా ఖండాలైన ప్రాచీన శిల్పాలకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ ఉన్నట్టు చెబుతున్నారు. ఇక్కడ ఉన్న శిల్పాలను పెకలించి తీసుకెళ్లి విక్రయించుకునేందుకే ముఠాలు పలుమార్లు ప్రయత్నాలు సాగించాయి.

 

అలాగే చెన్నకేశవ విగ్రహం కింద, 72 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభం అంతర్భాగంలో వజ్ర, వైడూర్యాలు నిక్షిప్తమై ఉన్నాయన్న ప్రచారం చాలా కాలంగా ఉంది. దీన్ని దష్టిలో ఉంచుకుని దుండగలు సోంపాళ్యం చెన్నకేశవ ఆలయంపై కన్నేశారని చెబుతున్నారు. ఇందులో భాగంగా 2009లో ముసుగులు ధరించిన దుండగులు ఆలయంలోకి చొరబడే ప్రయత్నం చేశారు. వెంట తెచ్చుకున్న నిచ్చెన ద్వారా లోనికి ప్రవేశించారు. వీరిని హ్గం గార్డులు అడ్డుకున్నారు.

 

 

దీంతో దుండగులు వెంట తెచ్చుకున్న మారణాయుధాల్లో కొన్నింటిని వదిలేసి వెళ్లారు. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మారణాయుధాల్లో సుత్తులు, రాడ్లు, కారంపొడి, స్టాండులు లభ్యమయ్యాయి. వీటిని శిల్పాలు తొలగించేందుకే తెచ్చి ఉంటారని నిర్ధారించారు.

-ముసుగు దొంగలు ఎవరు?

2009లో చెన్నకేశవ ఆలయంలోకి చొరబడిన నలుగురు ముసుగు దొంగలు ఎవరన్నది ఇంతవరకు తేలలేదు. ముసుగులు ధరించి ఆలయంలోకి చొరబడిన వారి వివరాలు మిస్టరీగా మిగిలిపోయింది. చొరబాటుకు పాల్పడిన ముసుగు దొంగల నుంచి ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో అప్పటి ఎస్పీ కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదని మౌళిక ఆదేశాలు ఇవ్వడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేయలేదు. అయితే దుండగులను ఎదుర్కొన్న హ్గంగార్డులకు పారితోషకాలు ప్రకటించారు. కేసు నమోదు చేయని కారణంగా చారిత్రాత్మక కట్టడంపై దుండగులు కన్ను వేశారన్న విషయం అధికారికంగా తెలియజెప్పే అవకాశం లేకపోయింది. దీంతో చొరబాటు దారులు పోలీసుల నుంచి తప్పించుకోగలిగారు.

15 స్థానాల్లో మార్పులు తప్పవా…

Tags: The gang eye on the Temple of the Solidarity

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *