వింత వ్యాధితో గిరిపుత్రులు సతమతం

Date:18/09/2020

విశాఖపట్నం ముచ్చట్లు

విశాఖ ఏజెన్సీలో వింత వ్యాధి గిరిజనులను కలవరపెడుతోంది. నెలరోజుల వ్యవధిలో వ్యాధి బారిన పడి నలుగురు మృతి చెందగా, మరో ఇరవై మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన గిరిజనుల్లో భయాందోళనకు గురిచేస్తోంది. ఈ  వింత వ్యాధి ఏంటి? వ్యాధి సోకటానికి గల కారణం ఏంటో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. విశాఖ జిల్లా అనంతగిరి కరకవలస గ్రామంలో అంతుపట్టని లక్షణాలతో కూడిన వ్యాధి విజృంభిస్తుంది. కడుపు నొప్పి, కళ్లు ఎర్ర బడటం , కాళ్ళు పొంగటం వంటి లక్షణాల తో వ్యాధి విస్తృతంగా సోకుతుంది. ఈ వ్యాధి బారిన పడి గడిచిన నెల రోజుల్లో నలుగురు మృత్యువాత పడగా సుమారు ముప్పై మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  అస్వస్థతకు గురైన వారిని నాలుగు అంబులెన్స్ అత్యవసర0గా విజయనగరం జిల్లా గజపతినగరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు.  మరికొంతమందిని విశాఖ కెజిహెచ్ కు తరలించారు. అయితే ఈ వ్యాధికి గల కారణాలు ఏంటి? ఎందుకు విస్తృతంగా సోకుతుందో అని ప్రాథమిక0గా ఆరా తీస్తున్నారు అధికారులు.. గిరిజనులు బాధపడుతున్న  ఈ లక్షణాలు ఏ వ్యాధికి సంభందించింది ? అసలు వ్యాధి రావటానికి గల కారణాలు ఏంటి? అన్న కోణంలో ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఏది ఏమైనా ఓ వైపు కరోనా విస్తరిస్తూ ముప్పుతిప్పలు పెడుతుంటే మరో వైపు ఏజెన్సీలో కొత్తగా వస్తున్న ఈ వ్యాధి స్థానికంగా అలజడి రేపుతుంది.. అధికారులు ముమ్మర కసరత్తు చేసి వ్యాధిని అరికట్టాలని కోరుతున్నారు గిరిజనులు.

అధికార పార్టీకి చట్టాలు వర్తించవా

Tags:The Giriputras are afflicted with a strange disease

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *