బాలిక అదృశ్యం

The girl disappears

Date:24/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని నక్కబండలో నివాసం ఉన్న సి.వీరభద్ర కుమారై సుమిత్ర (16) అదృశ్యంకావడంపై పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. సుమిత్ర ఇంటర్‌ చదువుతూ ఆపివేసింది. ఇలా ఉండగా ఈనెల 19న మధ్యాహ్నం అంగడిలో సరుకులు తీసుకొస్తానంటు వెళ్లి తిరిగి ఇంటి రాలేదు. దీనిపై తండ్రి వీరభద్ర బంధువులు, స్నేహితుల ప్రాంతాలకు వెళ్లి వెతికినా సుమిత్ర ఆచూకి తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెడ్‌కానిస్టేబుల్‌ సూర్యప్రకాష్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బాలిక ఆచూకి కోసం పోలీస్‌ బృందాలు వెళ్తున్నట్లు తెలిపారు.

అటవీ భూమి ఆక్రమణపై అడిగినందుకు విలేకరిని దుర్భాషలాడిన రేంజర్‌

Tags: The girl disappears

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *