అమ్మాయి వల వేసి….హత మార్చారు..

Date:10/06/2019

హైదరాబాద్  ముచ్చట్లు:

అమ్మాయి వల వేసి….హత మార్చారు..
చంపవద్దని కాళ్లు పట్టుకున్నమృతుడు జయరాం!m

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు చార్జిషీట్ ను దాఖలు చేశారు. 23 పేజీల ఈ చార్జిషీటులో హత్యకు సంబంధించిన సంచలన విషయాలను పోలీసులు తెలిపారు. హనీ ట్రాప్‌తో జయరాం హత్యకు రాకేష్ రెడ్డి కుట్ర పన్నినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. పిడిగుద్దులు గుద్ది మొహంపై దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి రాకేష్ రెడ్డి హత్య చేసినట్టు తేలింది. తరువాత పోలీసుల సూచనతోనే రాకేష్ రెడ్డి మృతదేహాన్ని నందిగామకు తరలించారు.
జయరాంను చిత్రహింసలు పెట్టి చంపుతునప్పుడు నిందితుడు  రాకేష్ రెడ్డి తతంగాన్ని వీడియోలో చిత్రీకరించాడు. 11 వీడియోలు, 13 ఫొటోలను నిందితులు తీశారు. హాస్పటల్‌కు తీసుకు వెళ్లమని రాకేష్‌ను జయరాం ఎంతగానో ప్రాధేయపడ్డాడు. ప్రతినెలా రూ.50 లక్షలు ఇస్తానని, డాక్యుమెంట్సు, పాస్ పోర్టు రాకేష్ దగ్గరే పెట్టుకుని తనను ప్రాణాలతో వదిలెయ్యాలని జయరాం బతిమలాడినట్టు పోలీసులు చార్జిషీట్  లో పేర్కోన్నారు.

 

 

 

 

 

 

 

వీణ పేరుతో జయరాం ను రాకేష్ లంచ్‌కు ఆహ్వానించినట్టు కుడా పేర్కోన్నారు. మరోవైపు, జయరాం శరీరంలో ఎటువంటి విష పదార్థాలు లేవని పోస్టుమార్టం రిపోర్ట్‌లో స్పష్టమయింది.  ఈ కేసు ఈ కేసు లో 12 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 73 మందిని సాక్షులుగా చేర్చారు. మృతుడి బంధువు శిఖా చౌదరి ని కుడా పోలీసులు సాక్షిగా పేర్కోన్నారు. నిందితులు గా  ఏ1 రాకేష్‌రెడ్డి, ఏ2 విశాల్, ఏ3  శ్రీనివాస్ (వాచ్ మాన్), ఏ4గా నగేష్ (రౌడీషీటర్), ఏ5గా సూర్య ప్రసాద్ (కమేడియన్), ఏ 6 కిషోర్ (సూర్య ప్రసాద్ స్నేహితుడు), ఏ7 సుభాష్ రెడ్డి (రియల్ ఎస్టేట్ వ్యాపారి), ఏ8 బీఎన్ రెడ్డి (టీడీపీ నేత), ఏ 9 అంజిరెడ్డి (రియల్ ఎస్టేట్ వ్యాపారి), ఏ 10 శ్రీనివాసులు (నల్లకుంట మాజీ ఇన్స్పెక్టర్), ఏ 11 రాంబాబు (రాయదుర్గం మాజీ ఇన్స్పెక్టర్), (ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ మల్లారెడ్డిని ఏ12 గా పేర్కోన్నారు.

నితిన్ కుమార్ కు ఎదురు లేదా…

Tags:The girl nets and … the change has changed ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *