పాలిసెట్ లో అమ్మాయిలు మెరిశారు

Date:26/04/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2019 (పాలీసెట్) ఫలితాలు వెల్లడయ్యాయి. పదో తరగతి తర్వాత వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షను ఏటా నిర్వహిస్తారు. ఏప్రిల్ 16న నిర్వహించిన పాలిసెట్ 2019కు తెలంగాణ వ్యాప్తంగా 1,03,591 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి నిర్వహించిన ఫలితాలను బూర్గుల రామకృష్ణారావు భవనంలో ఉన్న ఎస్‌బీటీఈటీ ఆఫీసులో నవీన్ మిట్టల్ విడుదల చేశారు. మొత్తం పరీక్ష రాసిన వారిలో 92.53 శాతం మంది అంటే 95,850 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పాలిసెట్ 2019లో సూర్యాపేట, సిద్దిపేట జిల్లాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు 120 మార్కులకు 120 సాధించి తొలి స్థానాల్లో నిలవగా, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు 119 మార్కులతో ఏడు, పదో స్థానం పొందారు. వాస్తవానికి షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 24న పాలిసెట్ ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. ఏప్రిల్ 25న ఫలితాలను వెల్లడిస్తారనే ప్రచారం జరిగినా, చివరకు శుక్రవారం వెల్లడించారు. ఈ అర్హత పరీక్షలో మెరిట్ ఆధారంగా డిప్లొమా కోర్సుల్లో వెబ్ కౌన్సిలింగ్‌ నిర్వహించి, సీట్లను కేటాయిస్తారు. దీనికి సంబంధించిన ప్రక్రియను త్వరలోనే వెల్లడించనున్నారు.
Tags:The girls shine in the palace

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *