The goal can be achieved by working hard

కష్టపడితే లక్ష్యాన్ని సాధించవచ్చు

Date:06/12/2019

కర్నూలు ముచ్చట్లు:

ప్రతి విద్యార్ధి భవిష్యత్తులో తాను ఏమి అవ్వాలో ఇప్పటి నుంచి బలంగా  నిర్ధేశించుకొని  ఆ దిశలో కష్టపడి చదివి ప్రయత్నిస్తే అనుకున్న లక్ష్యాన్ని  సాధించవచ్చని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ విద్యార్ధులకు హితవు చేశారు. నందికొట్కూరు మండలంలోని బ్రాహ్మణ కొట్కూర్ ప్రభుత్వ బిసి బాలుర సంక్షేమ వసతి గృహంలో గురువారం రాత్రి బస అనంతరం శుక్రవారం ఉదయం  ఆరు గంటలకు విద్యార్ధులతో  ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ తాను కూడా పేద కుటుంబం నుంచి వచ్చానని హాస్టల్లో ఉండి 13 సంవత్సరాల వయసులో 8వ తరగతి చదువుతున్నప్పుడు కలెక్టర్ కావాలని సంకల్పించి ఆమేర కష్టపడి 27వ ఏట ఐఏఎస్ సాధించానని ఈ తరహాలోనే విద్యార్ధులందరూ సంకల్ప బలంతో బాగా విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆక్షాంక్షించారు. సంక్షేమ వసతి గృహంలో విద్యార్ధులు కోరినట్లు గదుల్లో ఫ్యాన్లు, లైట్లు, భోజనం ప్లేట్లు తదితర సదుపాయాలన్నీ  సమకూరుస్తామని, క్రమశిక్షణతో చదివి పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలని  విద్యార్ధులను సూచించారు. సబ్జెక్టులలో  చదివేటప్పుడు  అర్ధం కాకపోయినా, కష్టం ఉన్న ట్యూటర్న్ అడిగి తెలుసుకోవడంతో పాటు టైం ఎక్కువ తీసుకొని కష్టపడి  ఇష్టంతో చదవాలని  విద్యార్ధులను ప్రోత్సహించారు. సమాజంలోని అన్ని రంగాలలో పోటితత్వం  పెరిగిందని బాగా చదివితే తప్ప ఉన్నత స్ధాయికి చేరుకోలెం అన్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాం, షుస్, కాస్మోటిక్ వస్తువులు, స్పోర్ట్స్ మెటీరియల్ తదితర సదుపాయాలపై కలెక్టర్ ఆరా తీయగా ఎనిమిదో తరగతి విద్యార్ధులు మ్యాధ్స్, సైన్స్, సోషల్ కు సంబంధించిన పాఠ్యపుస్తకాలు  అందలేదని, కాస్మోటిక్ వస్తువులు ఇవ్వడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందిస్తూ డిసెంబర్ మాసం వచ్చినా పాఠ్యపుస్తకాలు ఎందుకు పంపీణీ చేయలేదని సర్వ శిక్ష అభియాన్ పి ఓ ను ప్రశ్నిస్తూ  వెంటనే పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కాస్మోటిక్ వస్తువుల సరఫరా పై హాస్టల్  వార్డెన్ కలెక్టర్ ప్రశ్నించగా గత ఆరు మాసాల నుండి బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వార్డెన్ కలెక్టర్  కు నివేదించారు. హాస్టల్ లో చదువుతున్న విద్యార్దులను తమ బిడ్డ లాగా బాగా చూసుకోవాలని వార్డ్ నకు కలెక్టర్ సూచించారు. హాస్టల్ పరిసరాలు బాగా కలవని కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేసి, మరింత విద్యార్ధులకు మౌలిక సదుపాయాలు అందించడంతో పాటు గుణాత్మక విద్యను అందించి వారి భవిష్యత్ బంగారుబాట వేయాలన్నారు. విద్యార్ధులకు అందించే భోజనంలో నాణ్యత కొరవకుండ చూసుకోవాలన్నారు. ఆయన వెంట సర్వ  శిక్ష అభియాన్ పిఓ తిలక్ విద్యాసాగర్, మండల విద్యాశాఖాధికారి  జీవరత్నం, ఏ బి సి డబ్ల్యూ అధికారిని లక్ష్మిదేవి, సంక్షేమ గృహ అధికారి ఇజ్రాయిల్ రాస్, తదితరులు వెంట ఉన్నారు.

 

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వారసులను గౌరవించాలి

 

Tags:The goal can be achieved by working hard

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *