పుంగనూరులో దళితుల సంక్షేమమే లక్ష్యం

పుంగనూరు ముచ్చట్లు:

దళితులు అన్ని విధాల అభివృద్ధి చెందేలా కృషి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర దళిత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరప్ప తెలిపారు. శనివారం పుంగనూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు ప్రతినిధులను నియమించారు. ఇందులో భాగంగా రాష్ట్ర కమిటి సభ్యులుగా వెంకట్రామా, రత్నప్ప, హరి, విక్రమ్‌, నందీశ్వర్‌లను నియమించారు. వారిని సన్మానించారు. దళితులు , బడుగు బలహీన వర్గాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో సమితి నాయకులు గంగాధర్‌, నాగరాజు, గోవిందు, జ్యోతి, విజయకుమార్‌, సుబ్రమణ్యం, మల్లేష్‌, రామ్మూర్తి, గోవిందు, నాగరాజ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: The goal in Punganur is the welfare of Dalits

Leave A Reply

Your email address will not be published.