The goal is to help the poor on lockdown

లాక్‌డౌన్‌లో పేదలకు చేయూతనివ్వడమే లక్ష్యం

Date:04/05/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

కోవిడ్‌-19 నివారణలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ తో పేదలు పడుతున్న అవస్థలను గుర్తించి వారికి చేయూతనివ్వడమే లక్ష్యంగా సరుకులను పంపిణీ చేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దామోదరరాజు,ఏఐపీపీ మెంబరు అంజిబాబులు కొనియాడారు. సోమవారం ఎంపీటీసీ,ఎంపీపీ అభ్యర్థి రామమూర్తితో కలిసి మండలంలోని కాగతి, దుర్గసముద్రంలో ప్రతి ఇంటికి ఉచితంగా ఆరు రకాల నిత్యవసర సరుకులతోపాటు పండ్లు పంపిణీ చేశారు. కాగతిలో మాజీ ఎంపీటీసీ రమేష్‌,మాజీ సర్పంచ్‌ సుమిత్ర,చిన్నప్ప ఎంపీటీసీ అపర్ణ,నారాయణరెడ్డి లు, దుర్గసముద్రంలో వైఎస్సార్‌సీపీమహిళానేత జె.సరస్వతమ్మ,టీచర్‌ హరిబాబు ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ అంజిబాబు మాట్లాడుతూ సేవా భావంతో కరోనా విపత్తు సమయంలో జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ప్రజాప్రతినిధులు సొంత నిధులతో ఇలాంటి కార్యక్రమంచేపట్టడం ఆదర్శమన్నారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ల సూచనలమేరకు ఈ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. కవిడ్‌ నియంత్రణకు తగిన జాగ్రత్తలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐపీపీ మెంబరు అంజిబాబు,జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు,ఎంపీపీ అభ్యర్థి రామ్మూర్తి, సింగిల్‌విండో చైర్మన్‌ మునస్వామిరాజు, తదితరులు పాల్గొన్నారు.

కార్మికులకు చేతి తొడుగులు పంపిణీ

Tags: The goal is to help the poor on lockdown

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *