-జెడిఎం సరితారెడ్డి
Date:16/11/2019
పుంగనూరు ముచ్చట్లు:
నిరుద్యోగ యువతి , యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీడె ప్ జెడిఎం సరితారెడ్డి తెలిపారు. శనివారం స్థానిక శక్తి భవన్లో ఏపిఎం హరికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి ,యువకులకు ఉపాధి ఉద్యోగాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా సరితారెడ్డి, ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు, ఏరియా కో ఆర్డినేటర్ వాణిశ్రీ హాజరైయ్యారు. ఈ సదస్సులో సరితారెడ్డి మాట్లాడుతూ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు నిరుద్యోగ యువతి, యువకులకు అన్ని రంగాల్లోను ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం జాబ్ఓరియెంటేషన్, జాబ్మేళ కార్యక్రమాలను వినియోగించుకోవాలన్నారు. యువత శిక్షణ ద్వారా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు ఎంతో దోహాదపడుతుందన్నారు. నిరుద్యోగులకు ఇప్పటికే అనేక కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. ఈ అవకాశాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పి రెడ్డెమ్మ, సమాఖ్య అధ్యక్షురాలు కనకమ్మ, సీసీలు , నిరుద్యోగ యువతి, యువకులు పాల్గొన్నారు.
జూదర్లు అరెస్ట్ రూ.13 వేలు స్వాధీనం
Tags; The goal is to provide employment opportunities for unemployed youth