Natyam ad

అన్ని వర్గాల అభ్యున్నతే సీఎం వై.యస్.జగన్ ప్రభుత్వ లక్ష్యం

నందిగామ ముచ్చట్లు:


నందిగామ పట్టణంలోని 8 వ వార్డులో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు బుధవారం “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం” నిర్వహించారు. ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను -పనితీరును వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ,మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ,అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు , ఇచ్చిన హామీలలో 95 శాతం నెరవేర్చి చేతల ప్రభుత్వంగా ముఖ్యమంత్రి ప్రజలకు అండగా నిలబడ్డారన్నారు , అర్హత ప్రామాణికంగా కుల మత వర్గ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు ,ఈ సంక్షేమ పథకాలు పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ ,ఏఈ , కౌన్సిల్ మరియు కో ఆప్షన్ సభ్యులు ,వార్డ్ ఇన్చార్జిలు ,పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , వాలంటీర్లు పాల్గొన్నారు .

 

Tags: The goal of CM YS Jagan’s government is the development of all communities

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.