ప్రభుత్వం పూర్తిగా విఫలం

Date:27/10/2020

సామర్లకోట  ముచ్చట్లు:

వరుసగా వస్తున్న  వరదలు, తూఫానులతో ప్రజజీవనాన్ని అతలాకుతలం చేస్తే, వారిని కాపాడవలసిన ప్రభుత్వం ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని  తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు,  మాజీ ఉపముఖ్యమంత్రి,   పెద్దాపురం శాసనసభ్యుడు నిమ్మకాయల చిన రాజప్ప విమర్శించారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులు దైన్యపరిస్థితి ఉంటే వారి కష్టాలను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడితే
ఆయనను కించపరిచే విధంగా మాట్లాడడం తప్ప రైతులకు స్వాంతన చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవడంలో ఈ  రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మరి వ్యవసాయ  శాఖ మంత్రి  కురసాల కన్నబాబు  చంద్రబాబు నాయుడు, లోకేష్  లను  విమర్శించడం తప్ప రైతులను ఆదుకోవాలి అని ఆలోచన చేస్తే బాగుంటుందని సూచించారు.

 

విపత్తు సమయంలో రైతులకు జరిగిన నష్టాన్ని పరీశీలించడానికి నారా లోకేష్, నాలుగైదు జిల్లాలో పర్యటన చేసి ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవడం ప్రక్కన బెట్టి  లోకేష్  పై కేసులు పెట్టడంతో అత్యుత్సాహం చూపుతుందని ఎద్దేవా చేశారు.
తెదేపా ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద 3,100 కోట్లు మంజూరు చేసి రైతులను ఆదుకోవడం జరిగింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం వరుసగా మూడు  సార్లు వరద తుఫాన్లతో రైతులు నష్టపోతే 53 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ రూపంలో రిలీజ్ చేయడం…. పొంతన లేకుండా పోయింది. ఇక పంట భీమా కింద భీమా చేసిన ప్రతి రైతుకు గత తెదేపా  ప్రభుత్వం భీమా సొమ్మును సకాలంలో రైతులకు ఇప్పించటం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం పంట భీమా ద్వారా రైతులను కాపాడిన దాఖలాలు మచ్చుకైన కనిపించడం లేదని అన్నారు.

 

గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  ఏపీ సీడ్స్ నుంచి  కొనుగోలు చేసి వేసిన వరి పైరు నష్టం వాటిల్లిందని చెప్పారు. సాక్షాత్తు ఎమ్మెల్యే ఏపీ సీడ్స్ వలన నష్టపోయాను  అని గగ్గోలు పెడుతుంటే, సామాన్య రైతులు పరిస్థితి ఏంటి ? మరి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు  ఏపీ సీడ్స్ వలన పంట నష్టపోయిన రైతులకు ఏమి సమాధానం చెబుతారు?? అని  రాజప్ప డిమాండ్ చేశారు.   పెట్టుబడికి సరియైన రాబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారిని కాపాడడంలో ప్రభుత్వం విఫలం  చెందిందని విమర్శించారు.  రైతులు మరియు ప్రజలు కష్టాలు పడుతుంటే ఈ వైసిపి ప్రభుత్వ మంత్రులు ప్రజ సంక్షేమాన్ని పక్కన పెట్టిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ను   విమర్శించడమే ప్రధాన ఎజెండా పెట్టుకొన్నారని అయన అన్నారు.

లాక్‌డౌన్ విధించినా వెనక్కి తగ్గలేదు.. కర్రల సమరంతో రక్తపాతం

Tags: The government completely failed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *