గల్ఫ్ బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడలేదు

Date:17/09/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
గల్ఫ్ బాధిత కుటుంబాన్ని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గల్ఫ్ లో అరెస్టయిన నాగరకర్నూల్ జిల్లా వాసి ఇస్లావత్ కమ్లయ్యను విడిపించాలంటూ బాధిత కుటుంబం ఢిల్లీకి వచ్చిందని గల్ఫ్ తెలంగాణ వెల్పేర్ అండ్ కల్చరల్ అధ్యక్షుడు బసంత్ రెడ్డి అన్నారు. సోమవారం నాడు కమ్లయ్య తండ్రి ఒమ్లానాయక్,భార్య లలిత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శిని కలిసారు.
రెండేళ్ల క్రితం 2016లో బ్రతుకుదెరువు కోసం తన బావ గోపాల్ తో కలసి కమ్లయ్య గల్ప్ కు వెళ్లాడు. అక్కడ భవన నిర్మాణ కార్మికులుగా గల్ఫ్ లో పనుచేసారు. ఏడాదిన్నర క్రితం గోపాల్ అనుమానాదాస్పద స్ధితిలో మరణించడంతో కమ్లయ్యను అరెస్టు చేసి 20 ఏళ్ళ జైలు శిక్ష అక్కడి కోర్టు  విధించారు.
గోపాల్ భార్య క్షమాభిక్ష లేఖతో కమ్లయ్యను విడుదల చేయాలని విదేశాంగ శాఖ అధికారులను తండ్రి ఒమ్లానాయక్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కమ్లయ్యను గల్ఫ్ జైలు నుంచి విడిపించేందుకు సహకరించాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సోమవారం నాడు గల్ఫ్ తెలంగాణ వెల్పేర్ అండ్ కల్చరల్ అధ్యక్షుడు బసంత్ రెడ్డి ఆధ్వర్యంలో విదేశాంగ శాఖ అధికారులను కమ్లయ్య కుటుంబసభ్యులు కలిసారు.
Tags:The government does not care for Gulf victims

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *