బాధితులకు ఎల్లప్పుడు ప్రభుత్వం అండగా ఉంటుంది

– ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

Date:08/05/2020

పత్తికొండ  ముచ్చట్లు:

విశాఖ ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన బాధితుల విషయంలో ఎమ్మెల్యే శ్రీదేవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ఘటనలో చనిపోయిన కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన కోటి రూపాయలు సాయంపై హర్షం వ్యక్తం చేశారు.వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న వారికి 25 లక్షలు,స్వల్ప అస్వస్థత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి లక్ష అంతేగాక లీక్ ప్రభావిత గ్రామాల్లోని 15 వేల కుటుంబాలకు 10 వేలు చొప్పున పరిహారం ప్రకటించడాన్ని అన్ని వర్గాలు ప్రశంసిస్తూన్నాయి. అదేవిధంగా చనిపోయిన పశువులు కూడా నష్టపరిహారాన్ని అందజేయాలని కలెక్టర్ కు సీఎం ఆదేశాలు జారీ చేయడం గొప్ప విషయమని ఆమె కొనియాడారు.చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు ప్రకటించడం మునుపెన్నడూ ఏ సీఎం చేయని ఇలాంటి నిర్ణయాలు మా జగనన్నకే సాధ్యం అని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కొనియాడారు.

ముస్లింలందరూ రంజాన్ షాపింగ్ ను రద్దు చేసుకోండి

Tags: The government is always supportive of the victims

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *