మైనార్టీల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉంది

– ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ
Date:06/10/2018
భువనగిరి యదాద్రి  ముచ్చట్లు:
రాష్ట్రంలో మైనార్టీ వర్గాల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందని  ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. జిల్లా లోని ఆలేరు నియోజక వర్గ కేంద్రంలో తెరాస ఆధ్వర్యంలో జరిగిన మైనార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో మైనార్టీల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పించే విషయంలో తెరాస కట్టుబడి ఉందని, దీనికి కేంద్రంలోని ఎన్డీయే సర్కారు అడ్డుపడుతోందని ఆరోపించారు. ఈ విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. ఎన్నికల అనంతరం ఆలేరులో మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యేగా గొంగిడి సునీతను మళ్లీ గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో తెరాస నాయకులు  మహేందర్‌ రెడ్డి, ముస్లిం నాయకులు ఎండీ ఖాదర్‌, ఎండీ మహమ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.
Tags: The government is committed to the welfare of minorities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed