ఏపీలో మళ్లీ చంద్రన్న కానుకలు.. పంపిణీకి రెడీ అవుతున్న ప్రభుత్వం

-టీడీపీ గత ప్రభుత్వంలోనూ చంద్రన్న కానుకల పంపిణీ

-జగన్ అధికారంలోకి వచ్చాక పథకాల నిలిపివేత

-ప్రభుత్వంపై ఏడాదికి రూ. 538 కోట్ల అదనపు భారం

-తెలుగుదేశం ఆధ్వర్యంలోని ఏపీ ప్రభుత్వం మళ్లీ చంద్రన్న కానుకల పంపిణీకి రెడీ అవుతోంది.

 

అమరావతీ ముచ్చట్లు:

గతంలోనూ టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, చంద్రన్న రంజాన్ తోఫా వంటి పేర్లతో వీటిని పంపిణీ చేసింది. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది. తాజాగా, ఇప్పుడు మళ్లీ వీటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకాలను పునరుద్ధరించేందుకు పౌరసరఫరాలశాఖ కసరత్తు ప్రారంభించింది.సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ సందర్భంగా పేదలకు పంపిణీ చేసే ఈ కానుకల కోసం ప్రభుత్వం ఏడాదికి రూ. 538 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఐదేళ్లకు రూ. 2,690 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది. ఈ పథకం కింద చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక కింద అరకేజీ కందిపప్పు, అరకేజీ శనగపప్పు, అరకిలో బెల్లం, అర లీటరు పామాయిల్, కిలో గోధుమపిండి, రూ. 100 గ్రాముల నెయ్యితో కూడిన కిట్లను కార్డుదారులకు అందిస్తారు.అయితే, రంజాన్ తోఫాలో 2 కేజీల పంచదార, 5 కేజీల గోధుమపిండి, కిలో సేమ్యా, 100 గ్రాముల నెయ్యి ఇస్తారు. అలాగే, రెగ్యులర్ కోటా కింద రేషన్‌కార్డుదారులకు ఉచిత బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు, గోధుమపిండి, జొన్నలు, సజ్జలు కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

Tags: The government is getting ready to distribute the gifts of the moon again in AP

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *