అభివృద్దే ద్యేయంగా ప్రభుత్వం పని చేస్తోంది

The Government is working as an adaptation

The Government is working as an adaptation

Date:31/12/2018
కొత్తపేట ముచ్చట్లు:
అభివృద్దే ప్రధాన ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని నాలుగేళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో అనూహ్యమైన అభివృద్ధిని తీసుకువచ్చిన ఘనత  చంద్రబాబు ప్రభుత్వానిదేనని రాష్ట్ర శాసన మండలి ఇంచార్జి చైర్మన్  రెడ్డి సుబ్రమణ్యం అన్నారు. సోమవారం కొత్తపేట నియోజకవర్గంలోని  రావులపాలెం మండలంలో 15 కోట్లతో నిర్మించనున్న ర్యాలి నుండి పలివెల వయా వేదిరేశ్వరం వెళ్లే రహదారి పనులకు వెదిరేశ్వరం సెంటర్ నందు ఆర్.ఎస్ శంకుస్థాపన చేశారు.అలాగే  మండలంలోని పెంకులపాటి గురువు,వేదిరేశ్వరం,పితానివారిపాలెం గ్రామాలలో 10 లక్షల రూపాయల తో  నిర్మించనున్న 4 బీసీ కమ్యూనిటీ హాల్స్ కు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా   వేదిరేశ్వరం హై స్కూల్ నందు ఆర్ అండ్ బి వారు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రజలకు కనీస అవసరాలు అయిన తాగునీరు,రోడ్స్ గ్రామాల్లో అనేక  సదుపాయాలు ఏర్పాటుచేసి ,అనేక అభివృద్ది కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు.
కొత్తపేట నియోజక వర్గంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున రోడ్డు నిర్మాణాలు చేపట్టామన్నారు.ఈ నాలుగు ఏళ్ళలో టీడీపీ ప్రభుత్వం లో కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 200 కోట్లతో రోడ్స్ అభివృద్ధి చేసాము అంటే అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుందో ప్రజలు గ్రహించాలి అన్నారు.రాష్ట్ర విభజనతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అత్యంత చాకచక్యంగా రాష్ట్రప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని అన్నారు. ప్రాంతాలు కులాలు మతాలు వర్గాలు విభేదాలు లేకుండా అవసరాలను బట్టి ఆయా ప్రాంతాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ దిశలోనే కొత్తపేట నియోజకవర్గంలో కూడా ఎనలేని అభివృద్ధి జరిగిందని ఆయన వెల్లడించారు.ఈ  రోజు 15  కోట్ల రూపాయలతో నిర్మించనున్న  రోడ్డు కు అభివృద్ధి పనులు ప్రారంభించడం ఆనందదాయకం అని అన్నారు.
ఈరోడ్డుకు జ్యోతీరావుపులే అంబేద్కర్ మర్గ్ గా నామకరణం చేస్తామని చెప్పారు. మిగిలిన కాలంలో కూడా పూర్తిస్థాయిలో ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి పనులను తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.ఈ కార్యక్రమాలలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరరావు,డీసీఎమ్మెస్ చైర్మన్ కె.వి.సత్యనారాయణరెడ్డి,జడ్పీటీసీ ధరణాల రామకృష్ణ, ఎఎంసి చైర్మన్ లు వేగేశ్న చంద్రరాజు,ఈదల నల్లబాబు,కరుటూరి నరసింహారావు, ముళ్ళపూడి భాస్కరరావు, సయ్యప్పరాజు రామకృష్ణంరాజు, జక్కంపూడి వెంకటస్వామి,సిద్దిరెడ్డి పెద్దకాపు,బండారు సత్తిబాబు,సయ్యప్పరాజు జనార్ధనరాజు,రెడ్డి రామకృష్ణ,నామాల నాగేశ్వరరావు,మైగాపుల గురవయ్యనాయుడు,పోతుమూడి విజయలక్ష్మి,అల్లూరి సత్తిరాజు,నెక్కంటి సత్యనారాయణ,శ్రీనివాసరాజు,ఆర్ అండ్ బి డీఈ సి.హెచ్ సత్యవేణి,తహశీల్ధార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ జగదాంబ తదితరులు పాల్గొన్నారు.
Tags:The Government is working as an adaptation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed