ప్రభుత్వం దిగి రావాలి-సిఎస్ ను రద్దు చేయాలి

The government must come down-to cancel the CS

The government must come down-to cancel the CS

ఏపిసిసి అధ్యక్షులు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి
Date:11/10/2018
విజయవాడ  ముచ్చట్లు:
సిపిఎస్ రద్దు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని, బేషజలు  పోకుండా ప్రభుత్వం దిగి వచ్చి సిపిఎస్ ను రద్దు చేయాలని  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు  డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి  డిమాండ్ చేశారు..   సిపిఎస్ ను రద్దు చేయాలని ఉద్యోగుల సంఘం అధ్వర్యంలో ధర్నచౌక్ లో అమరణనిరహార దీక్ష ప్రారంభించారు. ఏపిసిపిఎస్ ఉద్యోగ సంఘాల అహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి దీక్ష శిబిరాని సందర్శించారు . వారి నిరసనకు ఏపిసిసి తరుపున మద్దతు ప్రకటించారు.. ఈ  సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ  దాదాపు రెండు నెలల క్రితం వేలాది మంది సిపిఎన్ ను  రద్దు చేయాలని జింఖాన గ్రౌండ్స్ లో  నిరసన కార్యక్రమానికి నేను రావడం జరిగిందన్నారు.
అదే రోజు మీరు ప్రభుత్వానికి అల్టీమేటం ఇచ్చారన్నారు. అక్టోబర్ 2వ తేదీ లోపు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని, సిపిఎస్ను రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్నే పునరుద్దరించాలని, ఆ విధానంగా నిర్ణయం తీసుకోకపోతే సామూహిక ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని అన్నారని,  కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగిందన్నారు.సిపిఎస్ రద్దు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందన్నారు. ప్రభుత్వం లక్షా 87 వేల మందికి సంబంధించిన విషయంపై నిర్ణయం తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. కేవలం కంటి తుడుపుగా ఒక కమిటీ వేస్తామని హామీ ఇచ్చి,  జాప్యం చేయడం సరైంది కాదని, దానిని ఖండిస్తున్నానని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు 653, 654, 655 జీవోలను ఇచ్చందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వందలాది జీవోలను ప్రభుత్వం రద్దు చేసిందని, కానీ ఈ మూడు జీవోలను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన జీవోలను కాంగ్రెస్ పార్టీయే రద్దు చేయమంటే ఇంకా ప్రభుత్వం ఇబ్బంది ఎమిటని అన్నారు. ఆ మూడు జీవోలను రద్దు చేయడానికి కమిటీ అవసరం లేదన్నారు. సిపిఎస్ రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రికి నిన్ననే లేఖ రాశానన్నారు. కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికల ప్రణాళికలో సిపిఎస్ రద్దు చేస్తామని పొందుపర్చామన్నారు. రాష్ట్రంలో ఏదీ అడ్డం కాదని, ఐదు నిమిషాల్లో జీవోను ఉపసంహరించడానికి అవకాశం ఉందని, వెంటనే ఉపసంహరించడని డిమాండ్ చేశారు.
13 జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్ష, కార్యదర్శులు అందరూ ఈ దీక్షలో కూర్చున్నారని, వారి సహనాన్ని పరీక్షించవద్దని, వారి ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని డిమాండ్ చేశారు. సిపిఎస్ వెంటనే రద్దు చేయాలని, వీళ్లు రద్దు  చేయకపోతే  2019లో ప్రజలు మాకు అధికారం ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తుందని స్పష్టం చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని, మీకు ఉన్న ఇబ్బందే ఇతర రాష్ట్రాల్లో మొత్తం కేంద్రం ప్రభుత్వంలో అటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఆలోచన చేయాలని ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ కోరతానని హామి ఇచ్చారు.గత నిరసన కార్యక్రమంలో 400 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారని, నాకు చాలా బాధ వేసిందన్నారు. అంత దూరం ఆలోచన చేయవద్దని, అంత దూరం ప్రభుత్వం కూడా పోనీయకూడదని, ప్రభుత్వం ప్రిస్టేజీకి పోకూడదన్నారు. ప్రభుత్వం మరీ మొండిగా ఉంటే మీరు ప్రాణాల వరకు తెచ్చుకోవద్దన్నారు
Tags:The Andhra Pradesh Congress Committee Chairperson On. Raghuvira Reddy Said That the

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *