చిన్న తరహ పారిశ్రామిక వేత్తల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపాలి

Date:09/10/2018
రాజకీయ పార్టీలు స్వయం ఉపాధి విషయంలో మానిఫెస్టోలో   చేర్చాలి
 అఖిలభారత చిన్న తరహ పరిశ్రమల మైనారిటీ కమిటి విజ్ఞప్తి
హైదరాబాద్ ముచ్చట్లు:
చిన్న తరహ ఔస్సహిక పారిశ్రామిక వేత్తల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపాలని అఖిలభారత చిన్న తరహ పరిశ్రమల మైనారిటీ కమిటి నేడొక  ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.రాజకీయ పార్టీలు స్వయం ఉపాధి విషయంలో ప్రత్యేకంగా తమ మానిఫెస్టోలో   చేర్చి నిరుద్యోగులైన యువత, మహిళల పరిస్థితులను మెరుగుపర్చడానికి అవసరమైన చర్యలకు హామీఇవ్వాలని డిమాండ్ చేసారు. లక్షలాది కుటుంబాల ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా లేవని, దేశంలో ఎవ్వరూ నిరుద్యోగులైన యువకుల సమస్యలను తమ సొంత విభాగాలను ప్రారంభించటానికి సహాయం చేయడానికి రాజకీయ పార్టీల దృష్టిని మళ్ళించాలని ఎవ్వరూ ప్రయత్నించలేదు. పేద ప్రజలకు ఆర్థిక వనరులను తమ ఉత్పత్తి విభాగాలను ప్రారంభించడానికి అనుమతి లేదు అని ఆయన అన్నారు.
యువతకు తగిన ఉపాధి కల్పించడంలో ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆయన విమర్శించారు.ఎంటెక్,బి.టెక్ వంటి ఉన్నత టెక్నికల్ డిగ్రీలను పొందిన తరువాత కూడా చాలామంది యువకులు కూడా నెలకు.రూ. 10,000 కూడా సంపాదించడం లేదని పేర్కొన్నారు.నిరుద్యోగ యువత సమస్యలను పరిష్కరించి, తమ సొంత విభాగాలను ప్రారంభించడానికి తగిన రుణాలు మరియు ఆర్ధిక సహాయం అందించడానికి పార్టీలు ప్రాధాన్యత ఇస్తాయని ఆయన వ్యక్తం చేశారు.నేడు చిన్న తరహ పరిశ్రమలు అనేక ఇబ్బందులను ఎదురుకొంటున్నాయని, వాటి అభివృద్ధి పట్ల ప్రభుత్వం ఏలాంటి శ్రద్ద చూపక పోవడం శోచనీయమని కమిటి అద్యక్షులు ఎస్.జెడ్.సయీద్ ,ప్రదాన కార్య దర్శి మీర్ ఆయుబ్ ఖాన్ పేర్కొన్నారు.
రాష్ట్రము లో చిన్న తరహ పరిశ్రమల ఇండస్త్రీయల్ పార్కును ఏర్పాటు చేయాలని ఏన్నో మార్లు ముఖ్య మంత్రి, పరిశ్రమల శాఖా మంత్రి,జిల్లా కలక్టర్ ,తో పాటు సంబందిత అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికి ప్రయోజనం లేదని వారు  ఆవేదన వ్యక్తం చేసారు.చిన్న తరహ ఇండస్త్రీయల్ పార్క్ ఏర్పాటు ద్వారా వివిధ జిల్లాలలోని చిన్న తరహ పారిశ్రామిక వేత్తలు ఒక్కటై అభివృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవడం పట్ల వారు  ఆవేదన వ్యక్తం చేసారు.ఇందుకు గాను తమ కమిటి హైదరాబాద్ నగరానికి 80 కిలో మీటర్ల దూరం లో మెదక్ జిల్లా లోని బుదిర గ్రామం లో స్తలాన్ని గుర్తించినట్లు తెలిపారు.ఈ స్తలం చిన్న తరహ పార్క్ కు ఎంతో అనువుగా ఉందని తెలిపారు.
ఇందులో చిన్న చిన్న ప్లాట్స్ ను ఏర్పాటు చేసి సరైన ఆమోదాలతో చిన్న తరహ పారిశ్రామిక వేత్తలకు కేటాయిస్తే వారు అభివృద్ధి చెందుతారని సయీద్ వివరించారు. ఇట్టి విషయమై ప్రబుత్వానికి సవివరంగా విన్న వించడం జరిగిందని,తాము చేసిన ప్రతి పాదనలను అంగీక రించాలని వారు కోరారు.తమ కమిటి ఏలాంటి లాభాపేక్ష లేని స్వయం ప్రతిపత్తిగల సంస్థ అని ఆయన తెలిపారు.నిరుద్యోగ యువత,మహిళల ఆర్ధికాభి వృద్ధి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.అంతే కాకుండా నిరుద్యోగుల యువత కోసం ఎన్నో చైతన్య కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.
Tags:The government should pay special attention to small scale industries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *