జిల్లాలో మసీదు ఆస్తులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి-జిల్లా ముస్లిం మైనార్టీ నేతల వినతి
నెల్లూరు ముచ్చట్లు:
ముస్లిం మైనారిటీ వక్ఫ్ బోర్డు ఆస్తుల మరియు హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ కి మరియు జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయ అధికారికి కలిసి మెమొరాండం ఇవ్వడం జరిగినది. నెల్లూరు పట్టణంలో అతి పురాతన కాలం జామియా మసీదు (జుమ్మా మసీదు) శిఖరాం వారి వీధి, ఈ మసీదు మరియు ఆస్థుల పూర్తి హక్కుల కోసం సోగరా బేగం అనే మహిళ వక్ఫ్ బోర్డు వారికి కోరి యున్నది. ఈమె 1998లో మసీదు భూమి పరమేశ్వరి నగర్, వాకర్స్ రోడ్, నెల్లూరు సర్వే నంబర్లు 117, 117/2, 118, 119, 120, 120/2 నందుగల 13.30 సెంట్లు ఇతరులకి అమ్మేసి ఉన్నది. ఈ భూమిని 2015 లో కూడా ప్లాట్లుగా విభజించి లీజుకు ఇచ్చి ఉన్నది. ఇది సుమారు 100 కోట్ల విలువగల మసీదు భూమి. ఈ ఆధారాలు కూడా మీకూ జెరాక్స్ కాపీలు ఇస్తున్నాము. కోటా ,వాకాడు లో సర్వే నుంబరు 427, 861 లో 14 ఎకరాల 34 సెంట్లు భూమీ కూడ ఈమె అమ్మేసి ఉన్నది.ఈమె జామియా మసీదుకు అనేక రకాలుగా నష్టం చేకూర్చి ఉంది. ఇంకా అనేక అభియోగాలు ఈమె పై ఉన్నదన్న విషయాన్ని అధికారికంగా గుర్తించాల్సి ఉందన్నారు. కావున మీరు ఈమెకి మసీదుకు సంబంధించిన ఏలాంటి అధికారం ఇవ్వకుండా వక్ఫ్ బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు . ఈ భూమిని సర్వే చేయిపించి ఈ భూమి మొత్తానికి ఫేన్సింగ్ ఏర్పాటు చేయాలనీ కోరారు. సొగరా బేగం గతంలో మసీదు పెద్దలకు అనేక విధాలుగా ఇబ్బంది పెట్టింది. భవిష్యత్తులో మసీదు ఆస్తులకు అన్యాక్రాంతం చేయకుండా ఈమెపై కఠిన మైనా చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నాం. జామియా మసీదు ముసల్లిలతో మరియు నెల్లూరు ముస్లిం పెద్దలతో చర్చించి రాజకీయాలతో సంబంధం లేకుండా మంచి కమిటీ ఏర్పాటు చేయాలని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో
మొహమ్మద్ జియాఉల్ హక్, మౌలానా అబ్దుల్ అజీజ్, హాజి సందానీ సాబ్, మొహమ్మద్ షబ్బీర్, షేక్ అల్లావుద్దీన్, ఉమర్ అనే నేను, షేక్ మున్నా, హాజీ మొహమ్మద్ హనీఫ్, ముజాహిద్, పఠాన్ బాషా, షాహుల్, గౌస్ బాషా, అబ్దుర్ రెహమాన్, యునుస్, బాబు తదితరులు పాల్గొన్నారు.
Tags: The government should protect the property of the mosque in the district – the request of the Muslim minority leaders of the district

