ప్రభుత్వం పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

The government should release the white paper on investments

The government should release the white paper on investments

– ఎంపి మిధున్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి.

Date:26/02/2018

రాయచోటి ముచ్చట్లు:

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం రాష్ట్రనికి వచ్చిన పెట్టుబడులపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని రాజంపేట ఎంపి మిధున్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిలు డిమాండు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రం వెలిగిపోతోందని చెబుతూ , కేంద్రం నుంచి నిధులు తెప్పించడంలో విఫలమయ్యార ని దుయ్యబట్టారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎద్దెవా చేశారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో రాయలసీమ వాసులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిందన్నారు. ప్రజా సంక్షేమం పట్టించుకోకుండ అధికార పార్టీ అవినీతి అక్రమాలతో డబ్బు సంపాదనే లక్ష్యంగా పని చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు ఏప్పుడు జరిగినా తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.

 

Tags: The government should release the white paper on investments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *