కరోనా వల్ల మరణించిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

ఏలూరు ముచ్చట్లు:

 

పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి రెవెన్యూ కార్యాలయం వద కరోనా వల్ల మరణించిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పెదవేగి మండలం రెవెన్యూ అధికారి సుందర్ సింగ్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మెమోరాండం సమర్పించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వల్ల మరణించిన వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కరోనా వచ్చి ఆస్పత్రి పాలైన ప్రతి ఒక్కరి ఆసుపత్రి బిల్లులను ముఖ్యమంత్రి సహాయనిధి నుండి చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు బొప్పన సుధాకర్, తాత సత్యనారాయణ,  శ్రీరామమూర్తి, మోహన్ రావు, అడపా శ్రీనివాసరావు, రామానుజo వెంకటేశ్వరరావు, కొమ్మిన  ప్రసాద్, రమణ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:The government should support every family that dies due to corona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *