అకాలవర్షం వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
ఈటల రాజేందర్
హైదరాబాద్ ముచ్చట్లు :
గురువారం కురిసిన చెడగొట్టు వానవల్ల ఆరు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చేముందు నష్టపోతే ఆ రైతు బాధ వర్ణనాతీతం. దీనిపై వ్యవసాయశాఖ, ముఖ్యమంత్రి స్పందించి రైతుకు భరోసా కల్పించకపోవడం బాధాకరం. కనీస సమీక్షలు లేవు. పాలన గాలికి వదిలివేసి కేవలం రాజకీయం మీదనే దృష్టి పెట్టారు. వెంటనే పంటనష్టం అంచనాలు వేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామని ఈటల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రం అందిస్తున్న ఫసల్ భీమా యోజన ఉపయోగించుకోకపోవడం దురదృష్టకరం అని ఆయన అన్నారు.
Tags;The government should support the farmers who lost their crops due to untimely rains

