50% శాతం ఫీజులు వసూలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి

అధిక ఫీజులను నియంత్రించాలని
బీజేవైఎం నాయకులు ఆందోళన

జగిత్యాల   ముచ్చట్లు :

భారతీయ జనతా యువమోర్చా జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని తాహశీల్ చౌరస్తా వద్ద మంగళవారం ప్రైవేట్ విద్యా సంస్థలలో విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ,దానిని నియంత్రించాలని ధర్నా నిర్వహించారు. కరోనా కష్టకాలంలో విద్యా సంస్థలు  50 శాతం ఫీజులు మాత్రమే తీసుకోవాలని  ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో 46ను వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా యువమొర్చ జిల్లా అధ్యక్షులు రెంటం జగదీష్  రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ సందర్బంగా జగదీష్ మాట్లాడుతూ విద్యార్థుల ఫీజుల చెల్లింపు పై కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు,రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ తీరుపై మండిపడ్డారు. కరోన కష్టకాలంలో ప్రజా జీవనమే భారంగా మారగా విద్యార్థుల తల్లితండ్రులను  ఫీజుల పేరుతో తీవ్ర అసహనానికి గురిచేస్తూన్నారని విమర్శించారు.
తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున జగిత్యాల పట్టణంలోని తహశీల్  చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు వీరభత్తిని అనిల్, బిజెవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనికెల నవీన్, స్వచ్ఛ భారత్ రాష్ట్ర కన్వీనర్ మంచే రాజేష్ ,ఉపాధ్యక్షులు మెరుగు ఉమేష్ , బైన ప్రశాంత్ మల్యాల మారుతి, కార్యదర్శి ఈర్ల నవీన్ మర్రిపెల్లి గంగాధర్, కోశాధికారి గుర్రం రంజిత్ రెడ్డి, అధికార ప్రతినిధి అరుణ్ యాదవ్, పట్టణ బీజేపి, అధ్యక్షులు బీజేవైఎం వివిధ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags:The government should take steps to collect 50% of the fees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *