Natyam ad

ఆరోగ్యమే మహాభాగ్యం’ నానుడిని నిజం చేసిన ప్రభుత్వం-  హోంమంత్రి తానేటి వనిత

కొవ్వూరు ముచ్చట్లు:


‘ఆరోగ్యమే మహాభాగ్యం’అనే నానుడిని నిజం చేస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్ది ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. కొవ్వూరు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని హోంమంత్రి ప్రారంభించారు. క్యాంపులో అందిస్తున్న వైద్య సేవల తీరును మంత్రి పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

 

ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ అందరికీ ఆరోగ్యం అందించాలి.. వారి ఆయుషును పెంచాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తెలిపారు.  రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ వైద్యులు ఎవరూ ఇంటివద్దకు వచ్చి పేద ప్రజల ఆరోగ్యక్షేమాలు తెలుసుకుని సేవలు అందించిన దాఖలాలు లేవన్నారు. దేశంలోనే మొదటిసారిగా స్పెషలిస్టులను ఇంటివద్దకు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఏ గ్రామానికి, ఏ ప్రాంతానికి వెళ్లినా జగనన్న ఆరొగ్య సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ప్రజల ముంగిటకే వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో ఉచితంగా వైద్య సేవలు అందించడంతో పాటు

 

 

 

Post Midle

ఎంతో ఖరీదైన మందులను కూడా అందిస్తున్నామన్నారు. కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తోందన్నారు.  మహిళా సాధికారిత సాధించే దిశగా జగనన్న పాలనలో అమ్మఒడి, ఆసరా, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, మహిళల పేరిట ఇళ్ల పట్టాలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తురన్నారు. మహిళలకే రైతులు, విద్యార్థులు  ఇలా అన్ని వర్గాల ప్రజలకు పథకాలు అందించిన సీఎం జగనన్న మాత్రమే హోంమంత్రి తానేటి వనిత స్ఫష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో పాటు చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ వైద్య నిపుణులు, ఇతర వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: The government that made the slogan ‘Arogyame Mahabhagyam’ come true- Home Minister Taneti Vanita

Post Midle