రామసేతును ప్రభుత్వం తొలగించబోదు: కేంద్ర ప్రభుత్వం

Date:16/03/2018
న్యూదిల్లీ  ముచ్చట్లు:
ప్రభుత్వం రామసేతును తొలగించబోదని, దాని పరిరక్షణకు సహకరిస్తుందని స్పష్టం చేసింది. రామసేతు కేసు విషయంలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఆడమ్స్‌ వంతెనగా పేరొందిన రామ సేతు తమిళనాడులోని రామేశ్వరానికి సమీపంలోని పంబన్‌ ద్వీపం నుంచి శ్రీలంక ఉత్తర తీరంలోని మన్నార్‌ ద్వీపం వరకు ఉంటుంది. భూగర్భ సిద్ధాంతాల ప్రకారం ఈ నిర్మాణం సహజంగా ఏర్పడిందని కొందరు వాదిస్తుండగా, మరికొందరు మాత్రం రావణుడితో శ్రీరాముడు యుద్ధం చేయడానికి లంకకు వెళ్లేందుకు రామసైన్యం దీన్ని నిర్మించిందని వాదిస్తున్నారు.రామసేతు ఉన్న ప్రాంతంలో గతంలో సేతు సముద్రం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 1990లలో దానిపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత 1997లో ప్రాజెక్టుపై ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2005లో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు తుది దశకు వచ్చింది. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 350 నాటికల్‌ మైళ్ల ప్రయాణం తగ్గుతుందని, భారత్‌లో సుమారు 13 చిన్న పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు, ఇతర మౌలిక సదుపాయాలు శ్రీలంక, భారత్‌లలో నిర్మించొచ్చని భావించారు. అయితే ఈ ప్రాజెక్టుతో రామసేతు ధ్వంసం అవుతుందని అప్పట్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే వర్గాలు వ్యతిరేకించాయి. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. రామసేతు విషయంలో మతపరమైన విశ్వాసాలు ఉన్నందున ప్రాజెక్టు కట్టకూడదని, దానికి జాతీయ వారసత్వ హోదా ఇవ్వాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేయగా.. కేసు విచారణ కొనసాగుతోంది.
Tags: The government will not remove Ramazethu: the central government

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *