The government's goal is to benefit every eligible family

అర్హత ఉన్న ప్రతి కుటుంభానికి లబ్దిచేకూర్చడమే ప్రభుత్వలక్ష్యం

– తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి
– దేశంలో ఎక్కడ లేని విధంగా పథకాలు అమలు
– చెప్పిన హామీలను అమలు చేస్తాం

Date:26/10/2020

చౌడేపల్లెముచ్చట్లు:

అర్హత ఉన్న ప్రతి కుటుంభానికి సంక్షేమ పథకాల్లో లబ్దిచేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక గాంధీ వీధిలో వైఎస్సార్‌సీపీ రాజంపేట, చిత్తూరు పార్లమెంటు సెగ్మెంట్య్ యూత్‌ విభాగం అధ్యక్షుడు మిద్దింటి కిషోర్‌బాబు ఏర్పాటుచేసిన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైయ్యారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో, పాదయాత్రలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని కొత్త పథకాలను అమలుచేస్తున్నారన్నారు. పేదల శ్రేయస్సుకోసం ఆర్థికంగా ఆదుకొంటూ తమదైన శైలిలో పాలన కొనసాగిస్తున్నారని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో టిడిపి నేతలు దోచుకోవడానికి, దాచుకోవడానికి సమయంకేటాయిస్తే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు ఎలాంటి పథకాల తేవాలి, వాటిని ఎలా అమలుచేస్తు పేదలను ఆదుకోవాలి ఆలోచనతో పాలన సాగిస్తున్నారన్నారు. ప్రజలందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రజలకు మంచి చేస్తూ ఇచ్చిన హామీలను అమలుచేసే నాయకత్వానికి ఎప్పుడు అండగా నిలవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి లను వైఎస్సార్‌సీపీ నేతలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో నేతలు మిద్దింటి శంకర్‌నారాయణ, అంజిబాబు,దామోదరరాజు, రామమూర్తి, రుక్మిణమ్మ,పద్మనాభరెడ్డి, సుధాకర్‌రెడ్డి, రాజేష్‌,తదితరులున్నారు.

ప్రత్యేక ప్రతిభావంతులకు ట్రై సైకిళ్లు పంపిణీ

Tags: The government’s goal is to benefit every eligible family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *